ఇక అది జనధనమే

ఇక అది జనధనమే - Sakshi


జన్‌ధన్ ఖాతాల్లో జమ అయిన నల్లధనం పేదలకే

ఆ ఖాతాల్లో డిపాజిట్ చేసిన నల్ల కుబేరులు జైలుకే


 

 - అవినీతికి వ్యతిరేకంగా పోరాటం నేరమా? చేయొద్దా?

 - 70 ఏళ్లుగా క్యూలోనే నిలబడ్డ ప్రజలకు ఇదే చివరి క్యూ

 - నిజాయితీపరులు బ్యాంకు ముందు, అవినీతిపరులు పేదల ఇళ్ల ముందు క్యూ

 - వ్యతిరేకులు నన్నేం చేయగలరు? నేనో ఫకీర్‌ని..

 - ప్రజలే నా నాయకులు... నాకు హైకమాండ్ లేదు

 - బిచ్చగాడు సైతం స్వైపింగ్ మిషన్ వాడుతున్నాడు

 - మొరాదాబాద్ బీజేపీ పరివర్తన్ ర్యాలీలో ప్రధాని మోదీ

 

 కొందరు నన్ను నేరస్తుడిగా పిలుస్తున్నారు. గత 70 ఏళ్లుగా ఈ దేశంలో నెలకొన్న అన్ని అనర్థాలకు ప్రధాన కారణమైన అవినీతికి వ్యతిరేకంగా పోరాటం నేరమా?.. నేనేదో నేరం చేసినట్లు ప్రతిపక్షాలు నన్ను ఇబ్బంది పెడుతున్నారుు. నా ప్రత్యర్థులు నన్నేం చేయగలరు. నేనొక ఫకీర్‌ను... నా కొద్దిపాటి వస్తువులతో నేను వెళ్లిపోగలను.

 

 ఎంతవరకూ వాస్తవమో తెలియదు కానీ.. వాట్సప్‌లో ఓ వీడియో హల్‌చల్ చేస్త్తోంది. ఒక వ్యక్తి తన వద్ద చిల్లర లేదని బిచ్చగాడికి చెబుతాడు. దీంతో బిచ్చగాడు స్వైపింగ్ మిషన్ బయటకు తీసి డెబిట్ కార్డు ఇమ్మంటాడు.

 

 అవినీతిపరులు, ధనవంతులు క్యూలో నిలబడి తమ డబ్బు బ్యాంకుల్లో డిపాజిట్ చేయమని పేదల్ని కోరుతున్నారు. బ్యాంకుల ముందు నిలబడకుండా పేదల ఇళ్లముందు వారు క్యూ కడుతున్నారు.

 

 క్యూలలో గంటల కొద్దీ నిలబడ్డ దేశ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా. క్యూలపై విపరీతంగా బాధపడుతున్న రాజకీయ నాయకుల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. మీరు స్వాతంత్య్రం తర్వాత మొత్తం దేశాన్ని దాదాపు 70 ఏళ్లు క్యూలో నిలబెట్టారు. పంచదార, కిరోసిన్, గోధుమల కోసం గతంలో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. అలాంటి క్యూలకు ముగింపు పలికేందుకు ఇదే చివరి క్యూ.


 

 మొరాదాబాద్ : జన్‌ధన్ ఖాతాల్లో చేరిన నల్లధనం పేదలకే చెందుతుందని, ఆ ఖాతాల్లో నగదు డిపాజిట్ చేసిన అవినీతిపరుల్ని ఎలా జైలుకు పంపాలన్న అంశంపై సమాలోచనలు చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలపై రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నిత్యావసరాల కోసం 70 ఏళ్లుగా రోజూ వరుసలో నిలబడుతున్న వారికి ఇక ఇదే చివరి క్యూ అని అన్నారు. త్వరలో యూపీ ఎన్నికల నేపథ్యంలో మొరాదాబాద్‌లో నిర్వహించిన బీజేపీ పరివర్తన్ యాత్రలో శనివారం మోదీ ప్రసంగించారు.‘జన్‌ధన్ ఖాతాల్లో ఇతరులు డబ్బులు వేస్తే వాటిని తిరిగి ఇవ్వక్కర్లేదు. మీరు అలా చేస్తానని వాగ్దానం చేస్తే... అక్రమంగా డబ్బును మీ ఖాతాల్లో వేసిన వారిని జైలుకు పంపేందుకు ఒక ప్రణాళిక తెస్తా. ఆ డబ్బు పేదలకే చెందుతుంది’ అని అన్నారు. అక్రమార్కులు ఈ ధనాన్ని పేదల నుంచి దోచుకుని ఏన్నో ఏళ్లుగా పేదల కోసం ఎలాంటి మంచి చేయడం లేదన్నారు. ‘క్యూలలో గంటల కొద్దీ నిలబడ్డ దేశ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా. క్యూలపై విపరీతంగా బాధపడుతున్న రాజకీయ నాయకుల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. మీరు స్వాతంత్య్రం తర్వాత మొత్తం దేశాన్ని దాదాపు 70 సంవత్సరాలు క్యూలో నిలబెట్టారు. పంచదార, కిరోసిన్, గోధుమల కోసం గతంలో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. అలాంటి క్యూలకు ముగింపు పలికేందుకు ఇదే చివరి క్యూ’ అని వ్యాఖ్యానించారు. వారిని నేను సరిచేస్తా

 ‘గతంలో డబ్బు డబ్బు అని, ఇప్పుడు మోదీ జపం చేస్తున్నవారిని సరిచేస్తా.. అవినీతిపరులు, ధనవంతులు క్యూలో నిలబడి తమ డబ్బు బ్యాంకుల్లో డిపాజిట్ చేయమని పేదల్ని కోరుతున్నారు. బ్యాంకుల ముందు నిలబడకుండా పేదల ఇళ్లముందు వారు క్యూ కడుతున్నారు’ అని మోదీ విమర్శించారు. ఏం జరిగినా ఈ పోరాటం ఆగదు

 నోట్ల రద్దు విషయంలో ప్రతిపక్షాలు తనను నేరస్తుడిగా పేర్కొంటున్నాయని ఆరోపించారు. ‘‘ కొందరు నన్ను నేరస్తుడిగా పిలుస్తున్నారు. గత 70 ఏళ్లుగా ఈ దేశంలో నెలకొన్న అన్ని అనర్థాలకు ప్రధాన కారణమైన అవినీతికి వ్యతిరేకంగా పోరాటం నేరమా?.. నేనేదో నేరం చేసినట్లు ప్రతిపక్షాలు నన్ను ఇబ్బంది పెడుతున్నారుు. నా ప్రత్యర్థులు నన్నేం చేయగలరు. నేనొక ఫకీర్‌ను... నా కొద్దిపాటి వస్తువులతో నేను వెళ్లిపోగలను’ అని చెప్పారు.  కాంగ్రెస్‌ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శిస్తూ.. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలే నాయకులని, తనకు హైకమాండ్ లేదన్నారు. అవినీతి దానంతట అదే పోదని, దానిని రూపుమాపాల్సి ఉందన్నారు. ప్రభుత్వాలు కేవలం ప్రకటనలు చేయడానికే పరిమితం కాకూడదని... పథకాల్ని ప్రారంభించి, వాటిని సమర్థంగా అమలయ్యేలా చూడాలన్నారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు కేవలం తమ కోసం, సన్నిహితుల కోసం పనిచేశాయని, పేదల కోసం ఏమీ చేయలేదని విమర్శించారు. దాచుకున్న వారే విమర్శిస్తున్నారు...

 ‘అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయకూడదా? అవినీతి వ్యతిరేక పోరాటం నేరమా? అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుంటే తప్పు చేస్తున్నానని ఎందుకు కొందరు విమర్శిస్తున్నారు? డబ్బు దాచుకున్న వారే నన్ను విమర్శిస్తున్నారు’ అని అన్నారు. అవినీతి నిర్మూలనకు క్యూలో నిలబడడం తప్పనిసరి

 ‘ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఉంటాయని నేను ముందే చెప్పాను. పరిస్థితులు మెరుగుపడతారుు. మీరు నగదు విత్‌డ్రా కోసం క్యూలలో నిలబడవచ్చు. అరుుతే అవినీతి నిర్మూలనకు అది తప్పనిసరి’ అని అన్నారు. విద్యుత్ సరఫరా లేని 18 వేల గ్రామాలకు వెరుు్య రోజుల్లో సరఫరా చేస్తామని రెడ్ ఫోర్ట్ నుంచి ప్రకటించానని, ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ సరఫరా లేని 1000 గ్రామాలుండగా... సగం సమయంలోనే ఆ రాష్ట్రంలో 950 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని ప్రధాని తెలిపారు.

 

 బిచ్చగాడి దగ్గరా స్వైపింగ్ మిషన్

 చివరికి బిచ్చగాడు కూడా అడుక్కునేందుకు స్వైపింగ్ మిషన్ వాడుతున్నాడని, ప్రజలు కూడా డిజిటల్ చెల్లింపులకు మారాలంటూ మోదీ ఒక వాట్సప్ వీడియోను ఉదహరించారు. ‘ఎంతవరకూ వాస్తవమో తెలియదు కానీ... వాట్సప్‌లో ఒక వీడియో హల్‌చల్ చేస్తోంది. ఒక వ్యక్తి తన వద్ద చిల్లర లేదని బిచ్చగాడికి చెబుతాడు. ఇంతలో బిచ్చగాడు ఆందోళన వద్దంటూ స్వైపింగ్ మిషన్ బయటకు తీసి డెబిట్ కార్డు ఇమ్మని అడుగుతాడు’ అంటూ ప్రధాని అనగానే బహిరంగసభలో నవ్వులు పూశారుు. నిర్ణయం వెనుక ఉద్దేశం సరైనదైతే కొత్త విషయాల్ని అంగీకరించేందుకు భారతీయులు ఎక్కువ సమయం తీసుకోరని మోదీ పేర్కొన్నారు.

 

 డిజిటల్‌కు మారండి

 ప్రజలు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు మారాలని మోదీ సూచించారు. మొబైల్ ఫోన్లను వాలెట్లుగా వాడాలని, ప్లాస్టిక్ మనీని ఉపయోగించాలని, దాంతో నగదు అవసరముండదన్నారు. దేశవ్యాప్తంగా 40 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని, వాటి ద్వారా నగదు రహిత చెల్లింపులు చేయాలన్నారు. ‘ఈ రోజుల్లో మొబైల్ బ్యాకింగ్, నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ప్రతీది దొరుకుతుంది. మీ ఫోన్‌లో కేవలం యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడమే... బ్యాంకులకు వెళ్లకుండా, క్యూలో నిలబడకుండా ప్రతీది సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నారు. మార్పును ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, దేశం ఇంకా సాంకేతికంగా అభివృద్ధి చెందలేదని చెపుతున్న వారిని మోదీ తప్పుపట్టారు. ‘అదే ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే సమయంలో బటన్ నొక్కే ఎన్నుకున్నారన్న విషయం గుర్తుంచుకోవాలి’ అని ప్రతిపక్షాలకు సూచించారు.దేశం నుంచి పేదరికం నిర్మూలించాలంటే ముందుగా పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి పేదరికాన్ని రూపుమాపాలన్నారు.

 

 స్వర్ణదేవాలయంలో వడ్డించిన మోదీ  

 అమృత్‌సర్: హార్ట్ ఆఫ్ ఆసియా కాన్ఫరెన్‌‌సలో పాల్గొనేందుకు అమృత్‌సర్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అస్రఫ్ ఘనీలు శనివారం సాయంత్రం స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ముందుగా చారిత్రక కారిడార్‌లో కొద్దిసేపు నడిచి అనంతరం స్వర్ణదేవాయాలనికి వెళ్లారు. ఈ సందర్భంగా భారీగా గుమిగూడిన ప్రజలు వారికి ఘన స్వా గతం పలికారు. వీరి రాక సందర్భంగా స్వర్ణ దేవాలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు. ఆలయంలో దాదాపు 30 నిమిషాలు గడిపిన మోదీ, ఘనీలు ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని వంటగదిలో భక్తులకు మోదీ ఆహారపదార్థాల్ని వడ్డించారు. ఇద్దరు అధినేతలకు ఆలయ నిర్వాహకులు 24 క్యారెట్ల స్వర్ణ దేవాలయం ప్రతిమను అందచేశారు. త్వరలో పంజాబ్‌లో ఎన్నికల నేపథ్యంలోనే మోదీ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించినట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. ఘనీ, మోదీలు నేడు అమృత్‌సర్‌లో జరిగే హార్ ఆఫ్ ఆసియా మినిస్టీరియల్ సదస్సును ప్రారంభిస్తారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top