4 నుంచి మోదీ విదేశీ పర్యటన | From 4th Modi foreign trip | Sakshi
Sakshi News home page

4 నుంచి మోదీ విదేశీ పర్యటన

May 30 2016 2:28 AM | Updated on Oct 4 2018 6:57 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 4న ఐదు దేశాల విదేశీ పర్యటనను ప్రారంభించనున్నారు. అఫ్గానిస్తాన్‌తో ప్రారంభించి ఖతార్, స్విట్జర్లాండ్‌ల్లో పర్యటించి, అనంతరం అమెరికా చేరుకుంటారు.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 4న ఐదు దేశాల విదేశీ పర్యటనను ప్రారంభించనున్నారు. అఫ్గానిస్తాన్‌తో ప్రారంభించి ఖతార్, స్విట్జర్లాండ్‌ల్లో పర్యటించి, అనంతరం అమెరికా చేరుకుంటారు. అక్కడ యూఎస్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత అఫ్గానిస్తాన్‌లో రూ. 1,400 కోట్ల భారత్ నిధులతో నిర్మించిన సల్మా ఆనకట్టను మోదీ ప్రారంభిస్తారు. ఖతార్‌లో రెండు రోజులుంటారు. 

స్విట్జర్లాండ్‌లో ఆ దేశాధ్యక్షుడు జోహన్ ష్నీడర్ అమన్‌తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా.. స్విస్ బ్యాంకుల్లో దాగిన భారతీయుల నల్లధనాన్ని వెలికితీయడంలో అక్కడి ప్రభుత్వ సహకారం కోరనున్నారు. అక్కడి నుంచి బయల్దేరి జూన్ 7వ తేదీన అమెరికా చేరుకుంటారు. తిరుగుప్రయాణంలో మెక్సికోలో ఆగి, అక్కడి నాయకత్వంతో వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement