భీమ్‌-కోరెగావ్‌: నలుగురు దళితుల అరెస్ట్‌

Four Dalits Arrested In Connection With Bhima-Koregaon Violence - Sakshi

పుణె : భీమా-కోరేగావ్‌లో చెలరేగిన అల్లర్ల కేసులో నలుగురు దళిత నాయకులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. భీమా-కోరేగావ్‌ యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా 200వ జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటున్న దళితులపై కోరేగావ్‌లో జనవరి 1న పెద్ద సంఖ్యలో హిందుత్వ కార్యకర్తలు, అగ్రవర్ణ కులాల వారు దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన మిలింద్‌ ఎక్‌బోతేను మే 14న పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరి కొంతమందిని ఈ ఘర్షణలకు కారణంగా చూపుతూ.. పోలీసులు నలుగురు దళిత నాయకులు సుధీర్‌ ధావాలే, లాయర్‌ సురేంద్రను, దళిత కార్యకర్త మోహన్‌ రౌత్‌,  రోనా విల్సన్‌లను అరెస్టు చేశారు.

కాగా, దళిత నాయకుడైన సుధీర్‌ ధావాలేను ముంబైలో, లాయర్‌ సురేంద్రను, దళిత కార్యకర్త మోహన్‌ రౌత్‌ను నాగ్‌పూర్‌లో, రోనా విల్సన్‌ను ఢిల్లీలో అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. భీమ్‌ కోరేగావ్‌లో జరిగిన ఘర్షణలకు వీరు పంచిన కరపత్రాలు, వీరిచ్చిన ప్రసాంగాలే ఉసిగొల్పినట్టు పోలీసు వెల్లడించారు. అరెస్ట్‌ అయిన వారిలో ఒకడైన సుధీర్‌ ‘ఎల్గర్‌ పరిషత్‌’ సంస్థ నిర్వహకులలో ఒకరు. జనవరి 1న కారేగావ్‌లో జయంతి ఉత్సావాలు నిర్వహించింది ఎల్గర్‌ పరిషత్‌ సంస్థే. రోనా విల్సన్‌ను ఢిల్లీలో పుణె పోలీసుల ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం సహయంతో అరెస్టు చేసి పటియాల కోర్టు ఎదుట హాజరుపర్చి రెండు రోజుల రిమాండ్‌కు తరలించారు.

ఇవి చదవండిహిందుత్వ నినాదాలతో దాడి.. ,   కోరెగావ్‌  ఓ శౌర్య ప్రతీక

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top