సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ : గుజరాత్‌ మాజీ డీఐజీకి ఊరట

Former Gujarat DIG Vanzara Discharged By Bombay HC In Sohrabuddin Shaikh Encounter Case - Sakshi

సాక్షి, ముంబై : గ్యాంగ్‌స్టర్‌ సోహ్రబుద్దీన్‌ షేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో గుజరాత్‌ మాజీ డీఐజీ డీజీ వంజర, ఐఏఎస్‌ అధికారులు దినేష్‌, రాజ్‌కుమార్‌ పాండియన్‌లకు విముక్తి లభించింది. కేసు విచారణ సందర్భంగా వీరిపై అభియోగాలు కొట్టివేయడానికి తాను వ్యతిరేకం కాదని  సీబీఐ స్పష్టం చేయడంతో వీరిపై అభియోగాలను బాంబే హైకోర్టు సోమవారం కొట్టివేసింది.

2005-2006లో సోహ్రబుద్దీన్‌ షేక్‌, ఆయన భార్య కౌసర్‌ బీ, వారి సహచరులు తులసీరాం ప్రజాపతి ఎన్‌కౌంటర్‌ కేసు నుంచి తనను తప్పించాలని గుజరాత్‌ ఐపీఎస్‌ అధికారి విపుల్‌ అగర్వాల్‌ దరఖాస్తును కోర్టు అనుమతించింది. కాగా ఈ కేసు నుంచి గుజరాత్‌ మాజీ డీఐజీ వంజర, ఐపీఎస్‌ అధికారులు ఎంఎన్‌ దినేష్‌, పాండియన్‌లను తప్పించడాన్ని సవాల్‌ చేస్తూ సోహ్రబుద్దీన్‌ సోదరుడు రుబాబుద్దీన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

విచారణ సందర్భంగా  ప్రత్యేక కోర్టు ప్రధాన నిందితులపై అభియోగాలను కొట్టివేయడాన్ని సోహ్రబుద్దీన్‌ సోదరుడు రుబాబుద్దీన్‌ న్యాయవాది గౌతం తివారి తప్పుపట్టారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top