తొలి లింగమార్పిడి యాంకర్.. పద్మిని! | First transgender news anchor says she got rid of her demons | Sakshi
Sakshi News home page

తొలి లింగమార్పిడి యాంకర్.. పద్మిని!

Sep 19 2014 11:40 AM | Updated on Sep 2 2017 1:39 PM

తొలి లింగమార్పిడి యాంకర్.. పద్మిని!

తొలి లింగమార్పిడి యాంకర్.. పద్మిని!

దేశ టెలివిజన్ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా.. లింగమార్పిడి చేయించుకున్న ఓ మహిళ న్యూస్రీడర్గా అవతారం ఎత్తింది.

దేశ టెలివిజన్ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా.. లింగమార్పిడి చేయించుకున్న ఓ మహిళ న్యూస్రీడర్గా అవతారం ఎత్తింది. దాంతో ఇప్పటికి తనకు సామాజికంగా, వ్యక్తిగతంగా ఉన్న సమస్యలన్నీ తీరిపోయాయని ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాత్రి 7 గంటలకు ఆమె తొలిసారిగా కెమెరా ముందు నిలబడి లోటస్ న్యూస్ ఛానల్ స్టూడియోలో వార్తలు చదివింది.

ఇంతకుముందు ఆమె కొన్ని టీవీ సీరియళ్లలో నటించింది. ఇంతకాలం ఆమెకు రకరకాల ఒత్తిళ్లు వచ్చాయి. ప్రధానంగా లింగమార్పిడి చేయించుకున్నవాళ్ల హక్కుల కోసం ఉద్యమించినప్పుడు, తమపై చూపుతున్న వివక్షకు, వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు ఆమెకు వచ్చిన సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కానీ, ఎట్టకేలకు న్యూస్ రీడర్గా రావడంతో అవన్నీ తొలగిపోయాయని చెబుతోంది. ఇది పెద్ద బాధ్యతేనని, ప్రత్యక్షంగా చదువుతున్నప్పుడు ఏ చిన్న తప్పు రాకుండా చూసుకోవాలని అంటోంది. మొదట్లో తాను కొంత భయపడ్డానని, కానీ ఇప్పుడు ప్రేక్షకులు కూడా తనను అర్థం చేసుకుంటున్నారని తెలిపింది. ఇప్పుడు కోయంబత్తూరు నుంచి ప్రసారమయ్యే లోటస్ న్యూస్ ఛానల్లో ప్రతిరోజూ రాత్రి 7గంటలకు ప్రసారమయ్యే బులెటిన్లో ఆమెను చూసేందుకే చాలామంది టీవీలు పెడుతున్నారట!

Advertisement
 
Advertisement
Advertisement