కూవాగంలో హిజ్రాల పెళ్లి సందడి | Koovagam Festival 2026, Transgender Wedding Celebrations And Miss Koovagam Crown Awarded In Tamil Nadu, Photos Went Viral | Sakshi
Sakshi News home page

Koovagam 2026: కూవాగంలో హిజ్రాల పెళ్లి సందడి

Apr 29 2026 12:32 PM | Updated on Apr 29 2026 1:07 PM

koovagam festival 2026

సాక్షి, చెన్నై : కూవాగంలో హిజ్రాల పెళ్లి సందడి మంగళవారం ఆనందోత్సాహాలతో జరిగింది. కూత్తాండవర్‌ ఆలయ పూజర్ల చేతుల మీదుగా తాళి కట్టించుకుని హిజ్రాలు ఆనందంలో మునిగి తేలారు. మిస్‌ కూవాగం 2026గా కోయంబత్తూరుకు చెందిన సూర్య ఎంపికయ్యారు. వివరాలు.. రాష్ట్రంలోని విల్లుపురం జిల్లా ఉలుందూర్‌ పేట సమీపంలోని కూవాగం గ్రామంలోని కూత్తాండవర్‌ ఆలయంలో  బ్రహా్మత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. 

ఇందులో భాగంగా హిజ్రాల వసంతోత్సవం వేడుక గత రెండు రోజులుగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ముఖ్య కార్యక్రమం హిజ్రాల పెళ్లి సందడి నిమిత్తం  దేశ విదేశాల నుంచి పెద్ద  ఎత్తున హిజ్రాలు  కూవాగంకు చేరుకున్నారు. ఎటు చూసినా, ఎక్కడ చూసినా హిజ్రాల సందడిగా పరిసరాలు మారాయి. లాడ్జీలు, గెస్టు హౌస్‌లు, విడిదులు హౌస్‌ ఫూల్‌. అందగత్తెలకు తామేమి తక్కువ కాదన్నట్టుగా సింగారించుకుని హిజ్రాలు ముందుకు సాగారు. హిజ్రాల పెళ్లి సందడి నిమిత్తం ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున దుకాణాలు వెలిశాయి.

 పెళ్లికి అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు, తాళి బొట్ల ను హిజ్రాలు కొనుగోలు చేశారు. ఆంధ్రా, కేరళ, కర్నాటక, మహారాష్ట్రలతో పాటుగా   విదేశాలకు చెందిన హిజ్రాలు సైతం  ఈ ఏడాది పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం. మంగళవారం మధ్యాహ్నం తర్వాత  కొత్త పెళ్లి కూతుళ్ల వలే ముస్తాభైన  హిజ్రాలు  కూత్తాండవర్‌ ఆలయం వద్దకు చేరుకోనున్నారు.  భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆలయ పూజారి చేతుల మీదుగా తాళి బొట్టు కట్టించుకుని ఆనంద  పారవశ్యంలో మునిగి తేలారు.  రాత్రంతా ఆలయం ఆవరణలో ఆట పాటలల్లో మునిగి తేలారు. ఇక, బుధవారం కూత్తాండవర్‌ రథోత్సవం జరగనుంది. ఆతర్వాత హిజ్రాలు వితంతువు వేషాలు ధరించి స్వస్థలాలకు బయలుదేరి వెళ్తారు.  



మిస్‌ కూవాగం  
ఈ  ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మిస్‌ కూవాగం – 2026 అందాల ఫలితాలను ప్రకటించారు. మిస్‌ కూవాగం – 2026 గా కోయంబత్తూర్‌ సూర్య ఎంపికయ్యారు. దక్షిణ భారత ట్రా న్స్‌జెండర్ల సమాఖ్య ఆధ్వర్యంలో విల్లుపురం మున్సిపల్‌ మైదానంలో సోమవారం రాత్రంతా ఈ పోటీలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనేకమంది ట్రా¯Œన్స్‌జెండర్లు తమ ప్రతిభను చాటుకున్నారు. మిస్‌ కూవాగంగా ఎంపికైన కోయంబత్తూరు సూర్యకు రూ.51 వేలు, మలేషియాకు చెందిన నిషా రెండోస్థానానికి గాను రూ. 25 వేలు, పుదుచ్చేరికి చెందిన అనన్య మూడో బహుమతిగా రూ. 11 వేలు దక్కించుకున్నారు. 

దివంగత సీనియర్‌ ట్రా న్స్‌జెండర్‌ రాధా అమ్మాళ్‌ స్మరిస్తూ ముందుగా నివాళులరి్పంచారు.  నటుడు మహేంద్రన్, నటి షనమ్‌ శెట్టి, నటుడు బాలా తదితరులు పాల్గొని విజేతలకు  బహుమతులను అందజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement