ఏనుగు అక్రమ నిర్బంధం.. మాజీ మంత్రికి నోటీసులు | Ex-minister gets notice for illegal possession of elephant | Sakshi
Sakshi News home page

ఏనుగు అక్రమ నిర్బంధం.. మాజీ మంత్రికి నోటీసులు

Jun 27 2015 1:49 PM | Updated on Sep 3 2017 4:28 AM

ఏనుగు అక్రమ నిర్బంధం.. మాజీ మంత్రికి నోటీసులు

ఏనుగు అక్రమ నిర్బంధం.. మాజీ మంత్రికి నోటీసులు

ఏనుగును నిర్బంధించిన కేసులో కేరళ మాజీ మంత్రి, నటుడు కేబీ గణేష్ కుమార్కు విజిలెన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది.

తిరువనంతపురం: ఏనుగును నిర్బంధించిన కేసులో కేరళ మాజీ మంత్రి, నటుడు కేబీ గణేష్ కుమార్కు విజిలెన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి.

20 ఏళ్ల క్రితం గణేష్ అటవీ శాఖ నుంచి ఓ ఏనుగును కొనుగోలు చేశారు. కావిలమ్మ భగవతీ దేవస్థానానికి కానుకగా ఇస్తానని హామీ ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఆరు నెలలోపు ఏనుగును దేవాలయానికి అప్పగించాలి. అయితే గణేష్ ఏనుగును దేవాలయానికి అప్పగించకుండా తన స్వాధీనంలో ఉంచుకున్నారు. ఏనుగును ఆదాయవనరుగా మార్చుకుని పండగల పూట అద్దెకు ఇచ్చేవాడని గణేష్పై ఫిర్యాదు చేశారు. దీనిపై జంతు హక్కుల సంఘాలు కూడా కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి ఫిర్యాదు చేశాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement