కోర్టు ముందుకు ‘ఎల్గార్‌’ కేసు నిందితులు

Elgar Case: Seven Accused Attended Before NIA Court In Mumbai - Sakshi

ముంబై: ఎల్గార్‌ పరిషద్‌–మావోయిస్టు లింకు కేసులో అరెస్టయిన ఏడుగురు శుక్రవారం ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసు విచారణను ఎన్‌ఐఏ తీసుకున్న కొద్దిరోజులకే నిందితులను కోర్టు ముందు ప్రవేశపెట్టారు.   2017కు సంబంధించిన ఈ కేసును పుణే పోలీసులు విచారణ జరుపుతుండగా, ఈ ఏడాది జనవరిలో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీకి బదలాయించారు. నిందితుల్లో సురేంద్ర గాడ్లింగ్, మహేశ్‌ రౌత్, రోనా విల్సన్, సుధీర్‌ ధవలే, వరవరరావు, అరుణ్‌ ఫెర్రీరా, సుధా భరద్వాజ్, షోమ సేన్, వెర్నన్‌ గోన్‌సాల్వేస్‌ ఉన్నారు. వీరిని బుధవారమే ఎర్రవాడ సెంట్రల్‌ జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాలతో శుక్రవారం వీరిని కోర్టు జడ్జి డీఈ కొతాలికర్‌ ముందు ప్రవేశపెట్టారు. కాగా, తదుపరి విచారణను మార్చి 13కు వాయిదా వేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top