కర్ణాటకలో కొనసాగుతున్న ఈసీ తనిఖీలు

EC's Flying Squad Inspects Karnataka CM Kumaraswamys Chopper At Shivamogga Helipad - Sakshi

బెంగుళూరు: కర్ణాటకలో ఈసీ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నికల అధికారులు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలను కూడా వదిలిపెట్టకుండా తనిఖీలు చేస్తున్నారు. శివమొగ్గలో ప్రచార నిమిత్తం వచ్చిన సీఎం కుమారస్వామి హెలికాప్టర్‌లో ఎన్నికల స్క్వాడ్‌ క్షుణ్ణంగా తఖీలు చేసింది. అలాగే ప్రతిపక్ష నేత బీఎస్‌ యడ్యూరప్ప హెలికాప్టర్‌లో కూడా తనిఖీలు నిర్వహించింది. కర్ణాటకలో ఈసారి ఎన్నికలు రెండు దశల్లో జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ నెల 18న జరిగే తొలిదశంలో 14 స్ధానాలకు పోలింగ్‌ జరగనుంది.

గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ మధ్య ముక్కోణపు పోటీ జరగ్గా మోదీ హవాతో బీజేపీ 17 స్థానాలు దక్కించుకుంది. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ హెలికాప్టర్‌లో కూడా ఈసీ ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది తనిఖీలు చేసినట్లు తెలిసింది. నవీన్‌ పట్నాయక్‌ సూట్‌ కేసును కూడా నిశితంగా పరిశీలించి..చివరికి ఏమీ దొరక్కపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం అందింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top