సర్టిఫికేషన్‌ ఉంటేనే ‘నమో’ ప్రసారాలు

EC Says NaMo TV Can Not Air Political Content Without Certification - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ ఇటీవల ప్రారంభించిన ‘నమో టీవీ’పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీచేసింది. రాజకీయ ప్రచారానికి సంబంధించిన సమాచారాన్ని తొలుత సర్టిఫికేషన్‌ చేయకుండా ఈ చానల్‌లో ప్రసారం చేయరాదని ఈసీ ఆదేశించింది. ఇప్పటికే ఏవైనా వీడియోలు ప్రసారమైతే వాటిని వెంటనే తొలగించాలని ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారికి సూచించింది. తాము నియమించిన మీడియా సర్టిఫికేషన్‌ కమిటీ ఆమోదం పొందినవాటినే ప్రసారం చేసుకోవాలని స్పష్టం చేసింది. ‘నమో టీవీ’ ప్రసారాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ సీఈవోను ఈసీ ఆదేశించింది. నమో టీవీ సర్టిఫికేషన్‌ లేకుండానే పలు వీడియోను ప్రసారం చేసినట్లు సీఈవో గుర్తించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top