
1350 స్టేషన్లలో ఈ-కేటరింగ్
ఈ-కేటరింగ్ విధానంతో 1350 రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు భోజనం, అల్పాహార సౌకర్యాన్ని రైల్వే శాఖ కల్పించింది.
న్యూఢిల్లీ: ఈ-కేటరింగ్ విధానంతో 1350 రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు భోజనం, అల్పాహార సౌకర్యాన్ని రైల్వే శాఖ కల్పించింది. భారతీయ రైల్వేలు, టూరిజం శాఖలు సంయుక్తంగా ప్రయాణికులకు నచ్చే రుచికరమైన ఆహారాన్ని అందిస్తాయి. కేఎఫ్‌సీ, డోమినాస్, బిట్టూ, టిక్కివాలా, ఫుడ్‌పాండా సంస్థల నుంచి ఆహార పదార్థాలను అందిస్తారు. టోల్ ఫ్రీ నంబర్ 1800111321లో వివరాలు తెలుసుకోవచ్చు.
టికెట్లపై బార్ కోడింగ్ ప్రారంభం..
రెవెన్యూ నష్టాలను నియంత్రించటం కోసం రిజర్వ్ కాని టిక్కెట్లపై బార్‌కోడ్‌లను ముద్రించే పనిని మంగళవారం ప్రారంభించింది. న్యూఢిల్లీ, పాతఢిల్లీ, నిజాముద్దీన్ స్టేషన్లలో ఐటీ ఆధారిత బార్ కోడింగ్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా పారంభించారు. ఈ విధానంలో టికెట్ నంబర్, స్టాక్ నెంబర్, ధర, రైలు ఎక్కిన స్టేషన్, గమ్యస్థానం, ప్రయాణికుల సంఖ్య, ప్రయాణించే తేదీ వంటివి ఎన్‌క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ రూపంలో ముద్రిస్తారు.