డ్రోన్ల వాణిజ్య వినియోగానికి గ్రీన్‌సిగ్నల్‌

drones will allow for comercial purposes - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు డ్రో‍న్ల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీచేసింది. డ్రోన్లను వ్యాపార కార్యకలాపాలు సహా అందరూ వినియోగించుకోవడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, నిబంధనలకు అనుగుణంగా డ్రోన్ల వినియోగానికి అనుమతిస్తామని పౌర విమానయాన కార్యదర్శి ఆర్‌ఎన్‌ చూబే చెప్పారు.

250 కిలోగ్రాముల నుంచి 150 కేజీల బరువుండే డ్రోన్లు ఐదు క్యాటగిరీలుగా విభజిస్తూ నూతన డ్రోన్‌ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. నిబంధనలకు అనుగుణంగా 200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తును నో డ్రోన్‌ జోన్‌గా పరిగణిస్తారు. విమానాశ్రయానికి ఐదు కిమీ పరిధిలో డ్రోన్లను అనుమతించరు.

ఢిల్లీలోని విజయ్‌ చౌక్‌ వంటి ప్రాంతాలు నో డ్రోన్‌ జోన్‌ పరిధిలోకి వస్తాయి. ఇక ఈ సంవత్సరాంతానికి సమగ్ర డ్రోన్‌ పాలసీ వెల్లడవుతుందని విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు భావిస్తున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top