వలస కూలీలకు ఉచిత రేషన్‌

Distribute free ration to eight crore migrants within 15 days - Sakshi

15 రోజుల్లోగా పంపిణీ చేయాలని రాష్ట్రాలను కోరిన కేంద్రం  

న్యూఢిల్లీ: వలస కూలీలకు ఉచిత రేషన్‌ను వెంటనే అందజేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. దేశవ్యాప్తంగా ఉన్న 8 కోట్ల మంది వలస కూలీలకు రెండు నెలలకు అవసరమైన ఆహారధాన్యాలు, పప్పులను గోదాముల నుంచి తీసుకుని 15 రోజుల్లోగా పంపిణీ చేయాలని కేంద్రం ఆహార శాఖ మంత్రి పాశ్వాన్‌ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే రేషన్‌ కార్డులు లేని వలస కూలీలు కూడా అర్హులేనన్నారు.

కుటుంబంలో ఒక్కొక్కరికి 5 కిలో చొప్పున గోధుమలు లేదా బియ్యం, 1 కిలో శనగలు మే, జూన్‌ రేషన్‌గా అందివ్వాలన్నారు. ప్రస్తుత అంచనా 8 కోట్లకు మించి వలస కూలీలున్నట్లయితే అదనంగా కూడా రేషన్‌ను కేంద్రం కేటాయిస్తుందనీ, వాస్తవ లబ్ధిదారులను రాష్ట్రాలు గుర్తించాలని, ఆ వివరాలను కేంద్రానికి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఢిల్లీ, గుజరాత్‌లకు గోధుమలతోపాటు బియ్యాన్ని, రాజస్తాన్, పంజాబ్, ఛండీగఢ్‌లకు గోధుమలు, ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బియ్యం కేటాయింపులు జరిగాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top