పునఃమూల్యాంకనాన్ని (రీవాల్యుయేషన్) అసలు ఎందుకు తీసేస్తున్నారో తెలపాలని ఢిల్లీ హైకోర్టు సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్)ను బుధవారం ఆదేశించింది.
న్యూఢిల్లీ: పునఃమూల్యాంకనాన్ని (రీవాల్యుయేషన్) అసలు ఎందుకు తీసేస్తున్నారో తెలపాలని ఢిల్లీ హైకోర్టు సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్)ను బుధవారం ఆదేశించింది. ఓ విద్యార్థి సమాధాన పత్రంలో జవాబులు సరిగానే ఉన్నా, సున్నా మార్కులు వేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీనిపై సమాధానం చెప్పాలని ఆదేశించింది. సీబీఎస్‌ఈ పునఃమూల్యాంకన విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టును గతంలో ఆశ్రయించారు.
ఈ కేసు విచారణను జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ, జస్టిస్ ఏకే చావ్లాల ధర్మాసనం బుధవారం కొనసాగించింది. కూడికలు చేయడమే రాని వారు గణిత శాస్త్రపేపర్లు దిద్దితే విశ్వసనీయత ఏం ఉంటుందని కోర్టు సీబీఎస్‌ఈని ప్రశ్నించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.