తలసేమియా విద్యార్థికి ఎంబీబీఎస్‌ సీటివ్వండి

Delhi HC directs admission of student with blood disorder to MBBS - Sakshi

న్యూఢిల్లీ: తలసేమియాతో బాధపడుతున్న విద్యార్థిని వైకల్యం కేటగిరీ కింద ఎంబీబీఎస్‌ కోర్సులో చేర్చుకోవాలని ఇంద్రప్రస్థ వర్సిటీకి ఢిల్లీ హైకోర్టు సూచించింది. వర్సిటీ పరిధిలోని కళాశాలలో చేర్చుకోవాలంది. తలసేమియాతో బాధపడుతున్న తనను వైకల్యం కేటగిరీ కింద వర్సిటీలో చేర్చుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ బాధితుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు.

దీనిపై విచారణ జరిపిన జడ్జి జస్టిస్‌ ఇందర్‌మీట్‌ కౌర్‌ పైవిధంగా ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని జనరల్‌ కేటగిరీ నుంచి వైకల్యం కేటగిరీకి 2017, జూలై 16న మార్చినట్లు పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు ‘రైట్స్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిజెబిలిటీస్‌ యాక్ట్‌ 2016’ ప్రకారం వైకల్యం ఉన్న వారి రిజర్వేషన్‌ను 3 నుంచి 5కు పెంచిందని ఆ కేటగిరీలో సీటు కేటాయించాలని సూచించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top