
డియర్.. ట్విటర్... ఇద్దరు మంత్రులు
ట్విటర్‌లో బిహార్ విద్యా మంత్రి అశోక్ చౌదరి కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీని ‘డియర్’ అని సంబోధించడంపై వివాదం తలెత్తింది.
న్యూఢిల్లీ: ట్విటర్‌లో బిహార్ విద్యా మంత్రి అశోక్ చౌదరి కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీని ‘డియర్’ అని సంబోధించడంపై వివాదం తలెత్తింది. బిహార్‌లో పర్యటిస్తున్న కేంద్రమంత్రిపై చౌదరి ట్విటర్‌లో ‘డియర్ స్మృతి ఇరానీ గారు.. మీరు రాజకీయ ప్రసంగాలపై కాకుండా నూతన విద్యావిధానంపై దృష్టి సారిస్తే బాగుంటుంద’ని రాశారు.
స్మృతి స్పందిస్తూ ‘మీరు మహిళలను ‘డియర్’ అని పిలవడం ఎప్పట్నుంచి మొదలుపెట్టారు’ అని అడిగారు. చౌదరి బదులిస్తూ.. ప్రొఫెషనల్ ఈ-మెయిల్స్‌పంపేటపుడు మొదట ‘డియర్’ రాస్తారు. నేనేమి అగౌరవంగా రాయలేదు..’ అని తెలిపారు. స్మృతి స్పందిస్తూ.. బిహార్‌లో క్షేత్రస్థాయిలో విద్యావిధాన ప్రణాళిక అమలు కాలేదని, రాష్ట్రంలో 2 లక్షల టీచర్ల పోస్టుల భర్తీ, కేంద్రీయ విద్యాలయాలకు భూకేటాయిపుపై మీ ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని అన్నారు.