breaking news
Minister Ashok Chowdhury
-
ప్రశాంత్ కిషోర్‌పై పరువు నష్టం దావా వేసిన మంత్రి
పాట్నా: జన్ సూరజ్ పార్టీ(జెఎస్పీ) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌పై బీహార్ మంత్రి, జేడీయూ సీనియర్ నేత అశోక్ చౌదరి పరువు నష్టం దావా వేశారు. అశోక్ చౌదరి గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తన కుమార్తె శాంభవికి ఎంపీ టికెట్ కోసం లోక్‌జన శక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు లంచం ఇచ్చారంటూ పీకే ఆరోపించారు. దీంతో తనపై అసత్యపు ఆరోపణలు చేసి, తన పరువు నష్టం కలిగించినందుకు దావా వేసినట్లు అశోక్ చౌదరి చెప్పారు. ప్రశాంత్ కిషోర్ తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుని.. క్షమాపణలు చెప్పాలన్నారు. లేదంటే తనపై చేసిన ఆరోపణలు నిజమేనని రుజువు చేస్తూ.. ఆధారాలు చూపాలంటూ ఆయన సవాల్ విసిరారు.ప్రశాంత్ కిషోర్ ఆరోపణలను అశోక్ చౌదరి తిప్పికొడుతూ.. తప్పుడు ఆరోపణలు చేసిన ప్రశాంత్ కిశోర్ తనకు క్షమాపణలు చెప్పకపోతే సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తానంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. కాగా, మంత్రి కుమార్తె శాంభవి ప్రస్తుతం సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి లోక్‌జన శక్తి పార్టీ ఎంపీగా ఉన్నారు. -
డియర్.. ట్విటర్... ఇద్దరు మంత్రులు
న్యూఢిల్లీ: ట్విటర్లో బిహార్ విద్యా మంత్రి అశోక్ చౌదరి కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీని ‘డియర్’ అని సంబోధించడంపై వివాదం తలెత్తింది. బిహార్‌లో పర్యటిస్తున్న కేంద్రమంత్రిపై చౌదరి ట్విటర్లో ‘డియర్ స్మృతి ఇరానీ గారు.. మీరు రాజకీయ ప్రసంగాలపై కాకుండా నూతన విద్యావిధానంపై దృష్టి సారిస్తే బాగుంటుంద’ని రాశారు. స్మృతి స్పందిస్తూ ‘మీరు మహిళలను ‘డియర్’ అని పిలవడం ఎప్పట్నుంచి మొదలుపెట్టారు’ అని అడిగారు. చౌదరి బదులిస్తూ.. ప్రొఫెషనల్ ఈ-మెయిల్స్పంపేటపుడు మొదట ‘డియర్’ రాస్తారు. నేనేమి అగౌరవంగా రాయలేదు..’ అని తెలిపారు. స్మృతి స్పందిస్తూ.. బిహార్‌లో క్షేత్రస్థాయిలో విద్యావిధాన ప్రణాళిక అమలు కాలేదని, రాష్ట్రంలో 2 లక్షల టీచర్ల పోస్టుల భర్తీ, కేంద్రీయ విద్యాలయాలకు భూకేటాయిపుపై మీ ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని అన్నారు.