'దావుద్ ఎప్పుడో లొంగిపోతా అన్నాడు'.. | Dawood Ibrahim wanted to surrender, CBI didn't go along: Ex-Delhi Police chief Neeraj Kumar | Sakshi
Sakshi News home page

'దావుద్ ఎప్పుడో లొంగిపోతా అన్నాడు'..

May 2 2015 11:26 AM | Updated on Sep 3 2017 1:18 AM

'దావుద్ ఎప్పుడో లొంగిపోతా అన్నాడు'..

'దావుద్ ఎప్పుడో లొంగిపోతా అన్నాడు'..

భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ సంచలన విషయాలను బయట పెట్టారు.

ముంబై: భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అండర్ వరల్డ్  డాన్ దావూద్ ఇబ్రహీం గురించి ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ సంచలన విషయాలను బయట పెట్టారు. ముంబై వరుస పేలుళ్లు జరిగిన 15 నెలలకే ప్రధాన సూత్రదారి దావుద్ లొంగిపాతానని రాయబారం నడిపినట్టు నీరజ్ తెలిపారు. అప్పటి సీబీఐ డీఐజీగా ఉన్న తనకు దావుద్ మూడుసార్లు ఫోన్ చేసి మాట్లాడినట్టు నీరజ్ కుమార్ చెప్పారు. భారత్ వస్తే ప్రత్యర్థులు తనని హతమారుస్తారెమోననే భయంతోనే దావుద్ లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు నీరజ్ తెలిపారు. కానీ అతను లొంగిపోతానన్న ప్రతిపాదనని సీబీఐ అంగీకరించలేదని చెప్పారు.
భారత్ వచ్చి లొంగిపోతానని దావుద్, ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానితోనూ రాయభారం సాగించారు. 2013లో ఢిల్లీ పోలీస్ కమిషనర్గా రిటైర్ అయిన నీరజ్ కుమార్ తన అనుభవాలను పుస్తకంలో రాయనున్నారు. మార్చి 12,1993న ముంబైలో జరిగిన పేలుళ్లలో 257 మంది మరణించగా, 700 మందికి పైగా గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement