వృద్ధుడిని కొట్టి చంపారు | Dalit man beaten to death in UP Muzaffarnagar, | Sakshi
Sakshi News home page

వృద్ధుడిని కొట్టి చంపారు

Mar 10 2016 12:38 PM | Updated on Sep 3 2017 7:26 PM

ఉత్తర ప్రదేశ్ లోని షామిలి జిల్లాలో దారుణం జరిగింది.

లక్నో:  ఉత్తర ప్రదేశ్ లోని షామిలి జిల్లాలో దారుణం జరిగింది. స్వల్ప వివాదానికి  దళిత వృద్ధుడిని కొట్టి చంపిన  వైనం ఆందోళన రేపింది.  మంగే రామ్ (60 )పై రోషన్, శేఖర్ అనే ఇద్దరు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో మాంగే రామ్ అక్కడిక్కడే చనిపోయాడు.
అకారణంగా తన సోదరుడిని కొట్టి చంపారని  మృతుడు  సోదరుడు రామ్ నివాస్  ఆరోపించారు. అతని ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement