
ఢిల్లీలో రోజురోజుకూ కరోనా మహమ్మారి ఉధృతి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ కరోనా మహమ్మారితో వణికిపోతోంది. రోజురోజుకూ మహమ్మారి కేసులు పెరుగుతున్న క్రమంలో బుధవారం సైతం ఢిల్లీలో 534 తాజా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 11,000 దాటిందని అధికారులు వెల్లడించారు. ఇక కరోనా మహమ్మారి బారినపడి ఢిల్లీలో మరణించిన వారి సంఖ్య 176కు పెరిగింది. మరోవైపు దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 5611 తాజా కేసులు బయటపడటంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,750కి ఎగబాకింది. మృతుల సంఖ్య 3303కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.