కేరళను వణికిస్తున్న కరోనా వైరస్..!

Covid 19 Three Year Old Kerala Child Tests Virus Positive - Sakshi

41కి చేరిన కేసుల సంఖ్య

తిరువనంతపురం: కరోనా వైరస్‌ వ్యాప్తితో కేరళ రాష్ట్రం బెంబేలెత్తుతోంది. అక్కడ ఆదివారం ఒక్కరోజే ఒకే కుటుంబంలో ఐదు కేసులు బయటపడగా.. సోమవారం మరోకేసు వెలుగు చూసింది. మూడేళ్ల చిన్నారికి కోవిడ్‌-19 మహమ్మారి సోకినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కుటుంబ సభ్యులతో పాటు ఇటీవల ఇటలీ వెళ్లొచ్చిన సదరు చిన్నారి వైరస్‌ బారిన పడిందని వైద్యులు తెలిపారు. ఇక రాష్ట్రంలో వైరస్‌ బారిన పడిన కుటుంబం పతనమిట్ట జిల్లాలో నివాసం ఉండటంతో.. అక్కడి పాఠశాలలకు కలెక్టర్‌ మూడు రోజులపాటు సెలవు ప్రకటించారు. కాగా, నెల క్రితం కేరళలో మూడు కేసులు నమోదు కాగా, చికిత్స అనంతరం వారు కోలుకున్నారు.
(చదవండి: భారత్‌లో మరోకేసు.. 40కి చేరిన బాధితులు)

మెల్లగా పుంజుకుంటోంది..
ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్త్ను కోవిడ్‌-19 భారత్‌లోనూ మెల్లగా పుంజుకుంటోంది. సోమవారం ఉదయం కశ్మీర్‌, కేరళలో బయటపడిన రెండు కేసులతో కలిపి వైరస్‌ బాధితుల సంఖ్య 41కి చేరింది. ఇక చైనా తర్వాత ఇరాన్‌, ఇటలీ దేశాల్లో ఈ మహమ్మారి అధిక ప్రభావం చూపుతోంది. గడిచిన 24 గంటల్లో ఇరాన్‌లో 49 మంది మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు ఆదివారం ధృవీకరించారు. ఇరాన్‌లో మొత్తం 6,566 కేసులు నమోదు కాగా.. 194 మంది ప్రాణాలు విడిచారు. ఇటలీలో ఒక్కరోజే 133 మంది మరణించటంతో మృతుల సంఖ్య 366కు చేరుకుంది. అదేవిధంగా మొత్తం కేసులు 5,883 అయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ బాధిత 95 దేశాలకు చెందిన 3,595 మంది చనిపోగా బాధితుల సంఖ్య 105,836కు చేరుకుంది. చైనా (3,097 మరణాలు, 80,695 కేసులు) ఆ తర్వాత దక్షిణ కొరియా(48 మరణాలు, 7,134 కేసులు), ఫ్రాన్సు (16 మృతులు, 949 కేసులు) ఉన్నాయి. అమెరికాలో కోవిడ్‌తో 17 మంది చనిపోగా 420 కేసులు బయటపడ్డాయి. అర్జెంటీనాలో మొదటి మరణం సంభవిం చింది. బల్గేరియా, పరాగ్వే తదితర దేశాల్లో నూ కోవిడ్‌ బాధితులను గుర్తించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గత నెలలో   నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్న ఓ వ్యక్తికి కోవిడ్‌ సోకినట్లు పరీక్షల్లో తేలింది.  
(చదవండి)
కరోనాతో ఇరాన్‌ ఎంపీ మృతి..!
37,000 దిగువన మరింత పతనం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top