ఢిల్లీలో సర్వే

COVID-19: Sero survey in Delhi begins to map exposure to corona virus - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి తీరును పూర్తిగా తెలుసుకునేందుకు అధికారులు శనివారం నగరంలో సెరోలాజికల్‌ సర్వే ప్రారంభించారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో 20 వేల మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. వారి శరీరంలో కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన యాంటీ బాడీలు ఉన్నాయో లేదో గుర్తించడానికే ఈ సర్వే చేపట్టినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తద్వారా ఎవరెవరూ ఈ వైరస్‌ బారినపడే అవకాశం ఉందో ముందే తెలుసుకోవచ్చని అధికారులు అంటున్నారు. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(ఎన్‌సీడీసీ), ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో జూలై 10వ తేదీ వరకు సెరోలాజికల్‌ సర్వే నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇంటింటికీ తిరిగి ప్రజల నుంచి నమూనాలు సేకరిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top