కరోనా.. 49 వేలు దాటిన కేసులు | Coronavirus Death Toll Rises To 1694 In India | Sakshi
Sakshi News home page

కరోనా.. 49 వేలు దాటిన కేసులు

May 6 2020 9:54 AM | Updated on May 6 2020 10:12 AM

Coronavirus Death Toll Rises To 1694 In India - Sakshi

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 2,958 కరోనా కేసులు నమోదు కాగా, 126 మంది మృతిచెందారు. దీంతో భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,391కి చేరింది.  ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 14,182 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1,694 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 33,514 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

అత్యధికంగా మహారాష్ట్రలో 15,525 కరోనా కేసులు నమోదు కాగా, 617 మంది మృతిచెందారు. గుజరాత్‌లో 6,245, ఢిల్లీలో 5,104, తమిళనాడులో 4,058, రాజస్తాన్‌లో 3,158, మధ్యప్రదేశ్‌లో 3,049, ఉత్తరప్రదేశ్‌లో 2,880 కరోనా కేసులు నమోదయ్యాయి. (చదవండి : టీకా అభివృద్ధిపై ప్రధాని సమీక్ష

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement