అత్యాచార నిందితుడికి కరోనా పాజిటివ్‌ | Coronavirus: Accused In Tihar Jail Quarantined After Complainant Tests Positive | Sakshi
Sakshi News home page

తీహార్‌ జైలు ఖైదీకి కరోనా పాజిటివ్‌

May 11 2020 8:44 PM | Updated on May 11 2020 8:44 PM

Coronavirus: Accused In Tihar Jail Quarantined After Complainant Tests Positive - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తీహార్ జైల్లో కరోనా వైరస్‌ కలకలం రేగింది. ఇటీవల అత్యాచార ఆరోపణల కింద అరెస్టు అయి తీహార్ జైలుకు వచ్చిన ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇతర జైలు సిబ్బంది, అధికారులతో పాటు మరో ఇద్దరు ఖైదీలను క్వారంటైన్‌కు తరలించారు. నిందితుడికి న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు.
(చదవండి : క్వారంటైన్ భ‌యం: రైల్లో నుంచి దూకి..)

అయితే అత్యాచార బాధితురాలికి కరోనా వైరస్‌ సోకడంతో నిందితుడికి కూడా వైద్యపరీక్షలు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. దీంతో జైలు అధికారులు నిందితుడికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది.  ఈ నేపథ్యంలో అతనితో పాటు మరో ఇద్దరి ఖైదీలను క్వారంటైన్‌కు తరలించారు. పెద్ద సంఖ్యలో ఖైదీలు ఉన్న తీహార్ జైలులో కరోనా కేసు వెలుగుచూడడంతో జైలు వర్గాల్లో ఆందోళన మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement