మూడు నెలలు ముప్పుతిప్పలే!

Corona Virus May Have Second Wave From September, Lancet - Sakshi

అమెరికా, దక్షిణాసియాలో విస్తరిస్తున్న మహమ్మారి

తాజా అధ్యయనంలో ప్రముఖ జర్నల్‌ లాన్సెట్‌ హెచ్చరిక

నిరోధానికి ఇప్పుడే వేగంగా కేసులను గుర్తించాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ రెండో దశ (సెకండ్‌ వేవ్‌) ప్రమాదం పొంచి ఉందని, కొందరు అంటువ్యాధి నిపుణులు చెబుతున్నట్లుగా రెండో దశలో వైరస్‌ తీవ్రత తగ్గుతుందన్న భావన సరికాదని ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ హెచ్చరించింది. అమెరికా, దక్షిణాసియా, మధ్యప్రాచ్యం అంతటా కరోనా మహమ్మారి వేగం పుంజుకుంటోందని, ప్రపంచం ప్రమాదకరమైన దశలో ఉందని వ్యా ఖ్యానించింది. కరోనా రెండో దశ సెప్టెంబర్‌లో ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు తాజా అధ్యయన నివేదికను విడుదల చేసింది. (కరోనా కేళి.. జేబులు ఖాళీ!)

స్పానిష్‌ఫ్లూ తరహాలో...
‘వైరస్‌ ఇప్పటికీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది ఘోరంగా మారుతోంది. చాలా మంది ఇంకా దీనిబారిన పడే అవకాశం ఉంది’ అని లాన్సెట్‌ పేర్కొంది. 1918లో యావత్‌ ప్రపం చాన్ని వణికించిన స్పానిష్‌ ఫ్లూ మహమ్మారిని లాన్సెట్‌ ప్రస్తావించింది. దాని వ్యాప్తి తీవ్రత మొదటి దశ మార్చి–జూలై మధ్య కొనసాగగా, ఆగస్ట్‌–డిసెంబర్‌ మధ్య కొనసాగిన రెండో దశ ఘోర విషాదాన్ని మిగిల్చిందని గుర్తుచేసింది. ఈ వైరస్‌ బారినపడి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల వరకు సంభవించిన మరణాల్లో ఎక్కువ భాగం 1918 సెప్టెంబర్‌–డిసెంబర్‌లోనే జరిగా యని నివేదిక పేర్కొంది. నాడు తొలి దశలో సరైన కట్టడి చర్యలు చేపట్టకపోవడం వల్ల వైరస్‌ రెండో దశ ప్రాణాంతకంగా మారిందని అభిప్రాయపడింది. ఇప్పుడు కూడా కరోనా మొదటి దశ తీవ్రత ప్రపంచవ్యాప్తంగా మార్చి నుంచే మొదలైందని, రానున్న రెండో దశను సమర్థంగా ఎదుర్కోవాలంటే ఏం చేయాలన్న దానిపై లాన్సెట్‌ పలు సూచనలు చేసింది.

లక్షణాలన్నీ కనిపించే దాకా ఆగొద్దు...
కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు కనిపించే వరకు వైరస్‌ బాధితులు నిరీక్షించకుండా కండరాల నొప్పి, అలసట, తలనొప్పి, విరేచనాలు, దద్దుర్లు వంటివి ఉన్నప్పుడే కరోనాగా అనుమానపడాల ని లాన్సెట్‌ స్పష్టం చేసింది. ఈ ప్రారంభ దశలోనే ఎవరికి వారు ఐసోలేషన్‌ అవడం వల్ల ఇతరులకు సోకే ప్రమాదాన్ని తగ్గించవచ్చని తెలిపింది. వైరస్‌కు సంబంధించిన అన్ని ఇన్ఫెక్షన్లను 48 గంటల్లోపు గుర్తించగలిగితే రెండో దశ ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉందని అంచనా వేసింది.

దీర్ఘకాలిక లాక్‌డౌన్‌లు పరిష్కారం కాదు
సామూహిక పరీక్షలు నిర్వహించడం, ట్రేసింగ్‌ చేయడం, ఐసోలేషన్‌ వల్ల కొత్త కేసులు రాకుండా నివారించవచ్చన్న లాన్సెట్‌... దీర్ఘకాలికంగా లాక్‌డౌన్లు విధించడం వైరస్‌ వ్యాప్తి నిరోధానికి పరిష్కారం కాదని అభిప్రాయపడింది. రెండు వారాలకు మించి లాక్‌డౌన్‌ ఉండ కూడదని సూచించింది. కరోనా వల్ల కుదేలైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను మళ్లీ గాడిన పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలాగే ప్రజల మానసిక ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడకుండా చూడాలని సూచించింది.

జాగ్రత్తలతో ఎంతో మేలు..
కరోనా కట్టడిలో ప్రాథమిక రోగ నిర్ధారణ, కాంటాక్ట్‌ ట్రేసింగ్, ఐసోలేషన్‌ అత్యంత కీలకమైనవని లాన్సెట్‌ నివేదిక తెలిపింది. ముఖ్యంగా ప్రజలంతా తప్పనిసరిగా ఒకటి, రెండు మీటర్ల భౌతికదూరం నిబంధనను పాటించడం, చేతులను తరచూ కడుక్కోవడం, మాస్క్‌లు ధరించడం, సామూహిక సమా వేశాలను నివారించడం వంటివి తప్పనిసరిగా చేపట్టాలని సూచించింది. బలహీనంగా ఉన్న వారిపైనే వైరస్‌ దాడి ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు ప్రభుత్వాలు వైరస్‌ పునరుత్పత్తి సంఖ్యను తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించింది. తద్వారా భవిష్యత్తులో వచ్చే రెండో దశ వైరస్‌ దాడిని ఎదుర్కోవడానికి ఇప్పుడే దాని అంతు చూడాలని లాన్సెట్‌ స్పష్టం చేసినట్లు నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీ క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి డాక్టర్‌ కిరణ్‌ మాదల తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

12-08-2020
Aug 12, 2020, 08:40 IST
సాక్షి, సిటీబ్యూరో: ‘పెద్దల మాట..చద్దన్నం మూట’ అన్నారు. సామెత పాతదే కావచ్చు. కానీ ఇప్పుడుకోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఇది ఒక ఆయుధంలాపనిచేస్తుంది....
12-08-2020
Aug 12, 2020, 08:29 IST
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగితే సదరు ఘటనలు పునరావృతం కాకుండాతగు చర్యలు...
12-08-2020
Aug 12, 2020, 08:20 IST
న్యూఢిల్లీ : కోవిడ్‌–19 నిరోధక టీకాను దేశవ్యాప్తంగా పంపిణీ చేయడం ఎలా అన్న అంశంపై బుధవారం నిపుణుల కమిటీ భేటీ...
12-08-2020
Aug 12, 2020, 07:50 IST
గాంధీఆస్పత్రి : కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రిలో బయోమెడికల్‌ (జీవ) వ్యర్థాలు రోజురోజుకూ గుట్టలుగా పేరుకుపోతున్నాయి. డంపింగ్‌యార్టుకు తరలించి...
12-08-2020
Aug 12, 2020, 06:26 IST
జీడిమెట్ల/చాదర్‌ఘాట్‌/కమ్మర్‌పల్లి: కరోనా భయంతో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కరోనాతో చిక్సిత పొందుతూ ఒకరు, కరోనా సోకిందేమోనన్న భయంతో మరొకరు, టీవీలో...
12-08-2020
Aug 12, 2020, 06:18 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 6,42,875 మందికి పరీక్షలు నిర్వహించగా.. 82,647...
12-08-2020
Aug 12, 2020, 04:49 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడి కోలుకుంటున్న వారి శాతం గణనీయంగా పెరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం...
12-08-2020
Aug 12, 2020, 03:56 IST
న్యూఢిల్లీ: కలసికట్టుగా కరోనాపై పోరాటం చేద్దామని ప్రధాని  మోదీ  ముఖ్యమంత్రులకు పిలుపు నిచ్చారు. కోవిడ్‌  కేసులు అత్యధికంగా ఉన్న 10...
12-08-2020
Aug 12, 2020, 03:50 IST
మాస్కో: కరోనా వైరస్‌ నిరోధానికి వ్యాక్సిన్‌ను తయారు చేసిన తొలిదేశంగా రష్యా రికార్డు సృష్టించినట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌...
12-08-2020
Aug 12, 2020, 03:44 IST
న్యూయార్క్‌/మాస్కో: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌–19 విజృంభణ ఆగడం లేదు. మంగళవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటేసింది. అమెరికా,...
12-08-2020
Aug 12, 2020, 00:47 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి వ్యాప్తితో ఎదురవుతున్న అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని దేశంలో వైద్య సదుపాయాలను పెంచే...
11-08-2020
Aug 11, 2020, 20:20 IST
అయితే, రామ్‌గోపాల్‌ వర్మకు కరోనా సోకినందున...అఫిడవిట్‌పై సంతకం చేయలేకపోయారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
11-08-2020
Aug 11, 2020, 19:01 IST
మాస్కో: ప్రపంచ దేశాలన్ని కరోనా మహమ్మారి వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను...
11-08-2020
Aug 11, 2020, 18:49 IST
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 58,315 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 9,024 మందికి పాజిటివ్‌గా తేలింది.
11-08-2020
Aug 11, 2020, 16:57 IST
బెర్లిన్‌: గొంతులో గరగరగా అనిపించినా.. ఇబ్బందిగా ఉన్నా వేడినీటిలో కాస్తా పసుపు వేసుకుని పుక్కిలిస్తారు మనలో చాలమంది. కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైన...
11-08-2020
Aug 11, 2020, 15:45 IST
న్యూఢిల్లీ: పది రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ను కట్టడి చేయగల్గితే.. భారత్‌ కోవిడ్‌ని జయించగలుగుతుంది అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కరోనా పరిస్థితులపై రాష్ట్ర...
11-08-2020
Aug 11, 2020, 14:54 IST
పుదుచ్చేరి : దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే సీనీ ప‌లువురు సినీ ప్రముఖులు, రాజ‌కీయ‌వేత్త‌లు వైర‌స్ బారిన...
11-08-2020
Aug 11, 2020, 14:49 IST
మాస్కో : కరోనా వైరస్‌ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచానికి రష్యా తీపికబురు అందించింది. ప్రపంచంలోనే తొలి కోవిడ్‌-19...
11-08-2020
Aug 11, 2020, 12:19 IST
చౌటుప్పల్‌ : కరోనా తీవ్రరూపం దాలుస్తు న్న నేపథ్యంలో ప్రజలు వినాయకచవితి వేడుకల్లో తప్పనిసరిగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని డీసీపీ...
11-08-2020
Aug 11, 2020, 12:10 IST
సత్తెనపల్లి: లిక్విడ్‌ శానిటైజర్‌ బదులు జెల్‌ శానిటైజర్లు మాత్రమే విక్రయించాలని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జిల్లా అడిషనల్‌ ఎస్పీ కె.ఆరీఫ్‌ హఫీజ్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top