కేవ‌లం నీళ్లు తాగి బ‌తుకుతున్నాం : వ‌ల‌స కూలీ

Corona : Migrant  Family Survive Only On Water For 3 Days - Sakshi

ల‌క్నో : వ‌ల‌స కార్మికుల క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. తిన‌డానికి తిండి లేక‌, ఉండ‌టానికి చోటు లేక వారు ప‌డుతున్న బాధ‌లు వ‌ర్ణ‌ణాతీతం. తాజాగా ఓ కుటుంబం మూడు రోజులుగా కేవ‌లం మంచినీళ్లు తాగి కాలం గ‌డిపారు. వివ‌రాలిలా ఉన్నాయి..ముంబైకి చెందిన ఆశిష్ విశ్వ‌క‌ర్మ భార్య‌, ఏడాది వ‌య‌సున్న చిన్నారితో క‌లిసి  ప‌నికోసం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కి వ‌ల‌స వెళ్లారు. స్వ‌త‌హాగా వ‌డ్రంగి అయిన ఆశిష్ విశ్మ‌క‌ర్మ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ చేరుకున్నాక లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. దీంతో చేతిలో ప‌నిలో లేక తిన‌డానికి తిండి లేక తీవ్ర అవ‌స్థ‌లు ప‌డ్డారు.  న‌ల్లాసోపారాలో నివాసం ఉండే వీరు ఎలాగైనా స్వ‌స్థ‌లానికి చేరుకోవాల‌ని చాలా ప్ర‌య‌త్నాలు చేశారు. (9 ఏళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారయత్నం, హత్య )

చివ‌ర‌కి ఆరు వేల రూపాయ‌ల‌కి ఓ ట్ర‌క్కులో ముంబై వెళ్లేందుకు ఒప్పందం చేసుకున్నారు. తీరా అక్క‌డికి చేరుకున్నాక తిరిగి ముంబై వెళ్లారా అస‌లు ఏం జ‌రిగింది ఆయ‌న మాటల్లోనే.. “ 35 మందితో క‌లిసి ట్ర‌క్ రాత్రికి బ‌య‌లుదేరుతుంద‌ని చెప్పారు. కానీ తీరా అక్క‌డికి చేరుకున్నాక 50 మంది ఉన్నారు. అంతేకాకుండా నేను నివాసం ఉంటున్న ప్రాంతంలో క‌రోనా పాజిటివ్ కేసులు ఉన్నాయ‌ని పుకార్లు రావ‌డంతో మ‌మ్మ‌ల్ని మ‌ధ్య‌లోనే దించేశారు.  తిన‌డానికి తిండి లేదు. న‌డుచుకుంటూనే జాన్‌పూర్‌కి చేరుకున్నాం. మార్గ‌మ‌ధ్యంలో ఓపిక న‌శించి ఏమైనా తిందామంటే హోట‌ళ్లు లేవు. మండే ఎండ‌లో క‌నీసం చెప్పులు లేకుండా కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాం. రోజుల త‌ర‌బ‌డి మంచి నీళ్ల‌తోనే క‌డుపునింపుకుంటున్నాం. ప‌ని చేద్దామ‌ని వ‌స్తే ఇప్ప‌డు సొంతూరు చేరుకోకుండానే ప్రాణం పోతుందేమో అనిపిస్తుంది. సాధార‌ణ రైలు స‌ర్వీసులు ప్రారంభం అవ్వ‌గానే ముంబై వెళ్లిపోతాం. ఈ క‌రోనా మా జీవితాల్లో చెప్ప‌లేనంత బాధ‌ను మిగిల్చింది. ” అంటూ ఆశిష్ క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యాడు. (చచ్చిపడిన గబ్బిలాలు.. స్థానికుల్లో ఆందోళన! )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top