కానిస్టేబుల్ ప్రాణాన్ని కాపాడిన పర్సు!

ఫిరోజాబాద్: కొన్ని నాణేలు, నాలుగు ఏటీఎం కార్డులు, ఒక శివుడి ఫొటో ఉన్న పర్సు ఓ కానిస్టేబుల్ ప్రాణాన్ని కాపాడింది. అదెలా అనుకుంటున్నారా? పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జరుగుతున్న ఆందోళనల్లో కానిస్టేబుల్ విజేందర్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. ‘ఆందోళనకారులెవరో కాల్పులు జరిపారు. దీంతో దూసుకొచ్చి న బుల్లెట్ నా జాకెట్ నుంచి చొచ్చుకుపోయి నా జేబులో ఉన్న పర్సులో చిక్కుకుపోయింది. పర్సులో కొన్ని నాణేలు, ఏటీఎం కార్డులు, శివుని ఫొటో ఉన్నాయి. నిజంగా నాకిది పునర్జన్మగా భావిస్తున్నాను’అని విజేందర్ చెప్పారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి