కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి అమరీందర్‌ | Congress chief candidate Amarinder | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి అమరీందర్‌

Jan 28 2017 3:31 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి అమరీందర్‌ - Sakshi

కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి అమరీందర్‌

ఫిబ్రవరి 4న పంజాబ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సీఎం అభ్యర్థిగా అమరీందర్‌ సింగ్‌ను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ ప్రకటించారు.

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటన
మాజితా (పంజాబ్‌): ఫిబ్రవరి 4న పంజాబ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సీఎం అభ్యర్థిగా అమరీందర్‌ సింగ్‌ను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలోభాగంగా పంజాబ్‌కు వచ్చిన రాహుల్‌ మాజితా నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన ర్యాలీలో మాట్లాడారు. ప్రజల సహకారంతో అమరీందర్‌ మాత్రమే పంజాబ్‌ను మార్చగలరని అన్నారు. ‘పంజాబ్‌ను పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తే పాలిస్తారు. పంజాబ్‌ వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారు. 

‘రిమోట్‌ కంట్రోల్‌’ ద్వారా పంజాబ్‌లో పాలన నడవబోదు.  తాము అధికారంలోకి వస్తే మత్తుపదార్థాల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం’ అని రాహుల్‌ వెల్లడించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాలకు ఏకకాలంలో సీఎం అవ్వాలని కోరుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ‘పంజాబ్‌ను అధికార బాదల్‌ కుటుంబం నాశనం చేస్తోంది. సామాన్య ప్రజల కోసం వీళ్లు చేసిందేమీ లేదు. కాని ప్రధాని వారికే మద్దతిస్తూ.. అవినీతిని నిర్మూలిస్తామంటున్నారు.’ అని ఆరోపించారు

Advertisement
 
Advertisement
Advertisement