
'బేరసారాలాడుతూ సీఎం కెమెరాకంటికి చిక్కారు'
ఉత్తరాఖండ్ సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు.
ఢిల్లీ: ఉత్తరాఖండ్ సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. ముఖ్యమంత్రి హరీష్ రావత్ స్వయంగా ఎమ్మెల్యేలతో బేరసారాలాడుతూ కెమెరాకు చిక్కారని తెలిపారు. ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం 91 ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు గద్దెదించాయని ధ్వజమెత్తారు. వీటికి సంబంధించి వివరాలను తన ఫేస్ బుక్ పేజీలో ఉంచారు. ఉత్తరాఖండ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తుందని తెలిపారు.
సీఎం హరీష్ రావత్‌పై చేసిన స్టింగ్ ఆపరేషన్ సీడీలను కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు బయటపెట్టిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతిపాలన విధిస్తున్నట్లు ప్రణబ్ ముఖర్జీ ఆదివారం నిర్ణయాన్ని ప్రకటించారు.
Congress and its supporters dismissed 91 non-Congress governments, and now crying foul... Read on https://t.co/xg6DRfDU3P
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 28 March 2016