పోలీసులపై సీఎం అల్లుడు తిట్ల వర్షం! | CM Yeddyurappa Son In Law Scuffle With Police In Belagavi | Sakshi
Sakshi News home page

పోలీసులతో యెడ్డీ అల్లుడు వాగ్వాదం

Oct 5 2019 12:42 PM | Updated on Oct 5 2019 12:59 PM

CM Yeddyurappa Son In Law Scuffle With Police In Belagavi - Sakshi

పోలీసులతో ఘర్షణపడుతున్న యడియూరప్ప అల్లుడు విరూపాక్ష

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప పెద్ద అల్లుడు విరూపాక్ష యమకనమరాది శనివారం పోలీసులతో ఘర్షణకు దిగారు. బెలగావిలోని ప్రభుత్వ ఆతిథి గృహం ( సర్క్యూట్‌ హౌస్‌ ) నుంచి విరూపాక్ష తన కారులో బయటకు వెళ్తున్న.. క్రమంలో నెమ్మదిగా వెళ్లమని పోలీసులు సూచించారు. అయితే ఆయన తమ మాటలు పట్టించుకోకపోవడంతో పోలీసులు కారును అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడై విరూపాక్ష తన కారును ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరుష పదజాలంతో పోలీసులపై తిట్ల వర్షం కురిపించారు. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు సర్క్యూట్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చి పోలీసులకు, విరూపాక్షకు మధ్య జరుగుతున్న ఘర్షణను శాంతింపజేశారు. కాగా యెడ్డీ పెద్ద అల్లుడైన విరూపాక్ష బెలగావికి చెందినవారు. ప్రస్తుతం ఆయన హుబ్లిలో పనిచేస్తున్నారు. కాగా విరూపాక్ష పోలీసులతో ఘర్షణ పడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement