ఒత్తిళ్లతో చైనా అసహనం

 Chinese Military Helicopters Were Flying Very Close To The Line of Actual Control - Sakshi

డ్రాగన్‌ దుందుడుకు చర్యలు

శ్రీనగర్‌ : నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ యుద్ధ విమానాల పెట్రోలింగ్‌ నేపథ్యంలో భారత్‌ విషయంలో చైనా సైతం కవ్వింపు చర్యలకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. లడఖ్‌లో నియంత్రణ రేఖ వెంబడి చైనా యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ చర్యతో భారత సైన్యం అప్రమత్తమైంది. చైనా యుద్ధ విమానాల పెట్రోలింగ్‌తో భారత వాయుసేన పెద్దసంఖ్యలో యుద్ధ విమానాలను లడఖ్‌లో మోహరించింది.

కాగా కోవిడ్‌-19 మూలాలపై ప్రపంచ దేశాలు చైనా వైపు సందేహంగా చూడటంతో పాటు పలు బహుళజాతి కంపెనీలు బీజింగ్‌ నుంచి భారత్‌కు తమ కార్యకలాపాలను తరలించాలని యోచిస్తుండటంతో  అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై ఒత్తిడి పెరిగింది. చైనాను చుట్టుముడుతున్న ఒత్తిళ్లతోనే డ్రాగన్‌ ఆర్మీ అసహనంతో దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన యుద్ధ నౌకలు దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద జలాల్లోకి ప్రవేశించాయని భద్రతా దళాలు భావిస్తున్నాయి.  

చదవండి : వూహాన్ జ‌నాభా మొత్తానికి క‌రోనా టెస్టులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top