శిశు సంరక్షణకు రెండేళ్ల సెలవు : సుప్రీం | Sakshi
Sakshi News home page

శిశు సంరక్షణకు రెండేళ్ల సెలవు : సుప్రీం

Published Wed, Apr 16 2014 4:08 AM

Child care    Two holiday: Supreme Court

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగి శిశు సంరక్షణ కోసం రెండేళ్ల పాటు నిరంతరాయంగా సెలవు తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిల్లల వ్యాధులు, పరీక్షలు వంటివి కూడా శిశు సంరక్షణ కిందకే వస్తాయని న్యాయమూర్తులు ఎస్.జె.ముఖోపాధ్యాయ, వి.గోపాలగౌడలతో కూడిన ధర్మాసనం మంగళవారం పేర్కొంది.

సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవు) నిబంధనలు 730 రోజుల పాటు నిరంతరాయంగా శిశు సంరక్షణ సెలవు (సీసీఎల్) తీసుకునేందు కు అనుమతించవన్న కోల్‌కతా హైకోర్టు ఉత్తర్వును న్యాయమూర్తులు తోసిపుచ్చారు. ‘వివిధ సర్క్యులర్లు, రూల్ 43-సి ప్రకారం.. 18 ఏళ్ల లోపు పిల్లలున్న మిహ ళా ప్రభుత్వోద్యోగి తన సర్వీసు మొత్తంలో ఇద్దరు పిల్లల వరకు గరిష్టంగా 730 రోజుల సీసీఎల్ తీసుకోవచ్చు. పిల్లల సంరక్షణ అంటే కేవలం చిన్న పిల్లోడి బాధ్యతలే కాదు.. పిల్లల విద్యకు సంబంధించిన పరీక్షలు, వారికొచ్చే జబ్బులు తదితర అంశాలు కూడా దానికిందకే వస్తారుు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.
 
 

Advertisement
Advertisement