ఆందోళన అక్కర్లేదు | Chief Justice Khehar Supports Entry Of Foreign Lawyers To India | Sakshi
Sakshi News home page

ఆందోళన అక్కర్లేదు

Jul 9 2017 1:10 AM | Updated on Sep 5 2017 3:34 PM

ఆందోళన అక్కర్లేదు

ఆందోళన అక్కర్లేదు

విదేశీ న్యాయవాదులను భారత్‌లో ప్రాక్టీస్‌ చేసుకోవడానికి అనుమతించే అంశంపై మన న్యాయవాదులు

విదేశీ లాయర్ల రాకపై సీజేఐ జస్టిస్‌ ఖేహర్‌
న్యూఢిల్లీ: విదేశీ న్యాయవాదులను భారత్‌లో ప్రాక్టీస్‌ చేసుకోవడానికి అనుమతించే అంశంపై మన న్యాయవాదులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ పేర్కొన్నారు. వారిని మన కోర్టులోకి అనుమతించడం వల్ల మన లాయర్లు వారి నుంచి నేర్చుకుని తమను మెరుగుపరచుకోవడానికి అవకాశముంటుందని, వ్యవస్థ మెరుగుపడుతుందని అన్నారు. ‘భారతీయ న్యాయవాదులు ప్రపంచంలోని ఏ న్యాయవాదికీ తీసిపోరు.. మనం కూడా విదేశాలకు వెళ్లి అక్కడి లాయర్ల స్థానాలను చేజిక్కించుకోగలం’ అని చెప్పారు.

ఆయన శనివారమిక్కడ ఇంటర్నేషనల్‌ లా అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన ఆలిండియా సెమినార్‌ను ప్రారంభించి ప్రసంగించారు. ‘చాలా దేశాలు భారత్‌లో తమ కోర్టులను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి. భారతీయ బార్‌ కౌన్సిల్‌ (బీసీఐ) దీన్ని వ్యతిరేకిస్తోంది. విదేశీ లాయర్లు మన దేశంలో ప్రాక్టీసు చేసుకోవడానికి అడ్వొకేట్‌ చట్టం అనుమతించదు’ అని ఆయన తెలిపారు. కాగా, విడిపోయిన భార్యాభర్తలు తమ పిల్లలపై హక్కు కోసం కోర్టుల్లో చేస్తున్న పోరాటాలు దేశ సరిహద్దులు దాటుతున్నాయని, దీంతో పిల్లలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని జస్టిస్‌ ఖేహర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశాల మధ్య సాగే పిల్లల అప్పగింత కేసుల పరిష్కారానికి ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరముందన్నారు. 

Advertisement
Advertisement