బుల్లెట్‌ రైలుకు ‘చిరుత’ లోగో

Cheetah will be face of PM Modi's high-speed train project

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.1.08లక్షల కోట్ల బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు ‘లోగో డిజైన్‌’ పోటీలో 27ఏళ్ల గ్రాఫిక్‌ డిజైనర్‌ చక్రధర్‌ ఆళ్ల విజేతగా నిలిచారు. మెరుపు వేగంతో దూసుకెళ్తున్న చిరుత పులి రైలు ఇంజన్‌పై కనిపించేలా ‘లోగో’ను సృష్టించి కాంపిటీషన్‌లో గెలిచాడు. ఇకపై బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అధికారిక పత్రాలపై ఈ లోగోనే వాడనున్నారు. ప్రస్తుతం చక్రధర్‌ అహ్మదాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌(ఎన్‌ఐడీ)లో గ్రాఫిక్‌ డిజైన్‌ పీజీ రెండో సంవత్సరం అభ్యసిస్తున్నాడు. అహ్మదాబాద్, ముంబై నగరాలను కలుపుతూ 500 కి.మీ. పొడవైన బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ చేపడుతోంది. సతీశ్‌ గుజ్రాల్‌ నేతృత్వంలోని కమిటీ చక్రధర్‌ లోగోను తుది విజేతగా ప్రకటించింది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top