వైద్య కోర్సుల్లో ‘రక్షణ రిజర్వేషన్ల’పై తేల్చండి | Centre to decide on defence quota in undergraduate medical courses: Delhi High Court | Sakshi
Sakshi News home page

వైద్య కోర్సుల్లో ‘రక్షణ రిజర్వేషన్ల’పై తేల్చండి

Oct 11 2016 6:10 PM | Updated on Sep 4 2017 4:59 PM

రక్షణ శాఖకు చెందిన వారికి రిజర్వేషన్లు కల్పిస్తారో లేదో తేల్చిచెప్పాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో రక్షణ శాఖకు చెందిన వారికి రిజర్వేషన్లు కల్పిస్తారో లేదో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తేల్చిచెప్పాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ఆరోగ్య శాఖను ఆదేశించింది. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే వైద్య కళాశాలల్లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో రక్షణ శాఖ వాళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని హోంశాఖ గతంలో సిఫార్సు చేసింది.

దీనిపై కుటుంబ సంక్షేమ శాఖ త్వరగా నిర్ణయం తీసుకోవాలనీ, తద్వారా రిజర్వేషన్లు ఇచ్చేలా అయితే వచ్చే ఏడాది నుంచే వాటిని అమలు చేయవచ్చని జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement