దేశంలోని వయోధికులకు ఆరోగ్య సేవలు, వసతి సౌకర్యం కల్పించేలా త్వరలో నూతన జాతీయ విధానాన్ని కేంద్రం తీసుకురానుంది.
వడోదరా: దేశంలోని వయోధికులకు ఆరోగ్య సేవలు, వసతి సౌకర్యం కల్పించేలా త్వరలో నూతన జాతీయ విధానాన్ని తీసుకురానున్నట్టు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదన ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ముందు పెట్టినట్టు సోమవారం వడోదరలో తెలిపారు.