స్క్రాప్ భలే.. ఆదాయం రూ. 156 కోట్లు | Central, West railways focused on waste material sales | Sakshi
Sakshi News home page

స్క్రాప్ భలే.. ఆదాయం రూ. 156 కోట్లు

Aug 25 2014 11:29 PM | Updated on Sep 15 2018 8:11 PM

సెంట్రల్, వెస్ట్ రైల్వేకు స్క్రాప్ ద్వారా మంచి ఆదాయం లభిస్తోంది.

సాక్షి, ముంబై: సెంట్రల్, వెస్ట్ రైల్వేకు స్క్రాప్ ద్వారా మంచి ఆదాయం లభిస్తోంది. ఈ రెండు రైల్వేకు చిత్తు (స్క్రాప్) ద్వారా కేవలం నాలుగు నెలల్లోనే రూ.156 కోట్ల ఆదాయం చేకూరింది. పనికిరాని వస్తువులను స్క్రాప్ కింద విక్రయించాలని పీఎంవో సూచనల మేరకు రైల్వే అధికారులు స్క్రాప్ ద్వారా ఆదాయాన్ని పెంచడంపై దృష్టి సారించారు. సెంట్రల్, వెస్టర్న్ రైల్వేలకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు దాదాపు రూ. 156 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది కేవలం స్క్రాప్ విక్రయించడం ద్వారా లభించింది.

 ఆదాయం ఇలా..: స్క్రాప్ ద్వారా వచ్చిన ఆదాయం మేరకు సెంట్రల్ రైల్వే అందజేసిన వివరాల ఇలా ఉన్నాయి.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో స్క్రాప్‌ను విక్రయించడం ద్వారా రూ.47 కోట్ల ఆదాయం చేకూరింది. ఈ ఏడాది జూలై 15వ తేదీ వరకు స్క్రాప్‌ను విక్రయించడం ద్వారా రూ.67 కోట్ల ఆదాయం చేకూరింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.302 కోట్లను స్క్రాప్ ద్వారా అర్జించాలని వెస్టర్న్ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. రూ.315 కోట్లతోనే సరిపెట్టుకుంది.

ఈ  ఆర్థిక సంవత్సరంలో రూ.220 కోట్లను అర్జించాలని సెంట్రల్ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు రూ.89 కోట్లను ఆర్జించింది. వివిధ యార్డుల్లో చాలా వృథాగా పడిఉన్న సామగ్రిని విక్రయించడం ద్వారా భారీ ఆదాయం చేకూరుతోందని  రైల్వే అధికారులు పేర్కొన్నారు.

 ట్రాక్స్ విక్రయాలతో..: రైల్వే అధికారులు అందజేసిన వివరాల మేరకు.. 2010- 11 ఆర్థిక సంవత్సరంలో పాడుబడిన రైల్వే ట్రాక్స్‌ను విక్రయిచండం ద్వారా రైల్వేకు భారీ మొత్తంలో ఆదాయం చేకూరింది. పాతబడిన బోగీలు, చక్రాలు, ఓవర్‌హెడ్ ఎలక్ట్రికల్ వైర్ల విక్రయం ద్వారా కూడా ఆదాయం వచ్చింది. ఈ ఏడాదిలో కేవలం రైల్వే ట్రాక్‌లను విక్రయించడం ద్వారా రైల్వేకు రూ.230 కోట్ల ఆదాయం వచ్చింది. స్క్రాప్‌ను విక్రయించడం ద్వారా వచ్చిన భారీ ఆదాయం రైల్వే నష్టాలను కొంత మేర భర్తీ చేస్తోందని అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.  

 స్క్రాప్‌ను సేకరిస్తున్నాం : పీఆర్వో
 సెంట్రల్ రైల్వే పీఆర్వో ఎ.కె.సింగ్  మాట్లాడుతూ.. అన్ని రైల్వే యార్డుల్లో, ఇతర ప్రాంతాల్లో వృథాగా పడి ఉన్న స్క్రాప్‌ను సేకరిస్తున్నామని చెప్పారు. వీటి విక్రయం ద్వారా మంచి ఆదాయం వస్తుందని అన్నారు. వెస్టర్న్, సెంట్రల్ ఇరు రైల్వేల్లో చాలా సామగ్రి వృథాగా పడి ఉందని  తెలిపారు. విరార్, మహాలక్ష్మి, లోయర్ పరేల్, ముంబై సెంట్రల్, కల్వా, పరేల్ వర్క్‌షాపుల్లో చాలా సామగ్రి నిరుపయోగంగా పడి ఉందని, త్వరలో విక్రయిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement