కేంద్ర సాహిత్య అకాడమీలో పూడూరి రాజిరెడ్డి ముచ్చట! | Central Sahitya Akademi in Puduri Raji Reddy | Sakshi
Sakshi News home page

కేంద్ర సాహిత్య అకాడమీలో పూడూరి రాజిరెడ్డి ముచ్చట!

Feb 24 2017 2:50 AM | Updated on Sep 5 2017 4:26 AM

కేంద్ర సాహిత్య అకాడమీలో పూడూరి రాజిరెడ్డి ముచ్చట!

కేంద్ర సాహిత్య అకాడమీలో పూడూరి రాజిరెడ్డి ముచ్చట!

కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించిన యువ సాహితీ–ది న్యూ హార్వెస్ట్‌ కార్యక్ర మంలో యువ రచయిత, ‘సాక్షి’ సాహిత్య పేజీ ఇన్‌చార్జి పూడూరి రాజిరెడ్డి తాను రాసిన కథను ఆంగ్లంలో వినిపించారు.

తన కథను ఆంగ్లంలో చదివి వినిపించిన రాజిరెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించిన యువ సాహితీ–ది న్యూ హార్వెస్ట్‌ కార్యక్ర మంలో యువ రచయిత, ‘సాక్షి’ సాహిత్య పేజీ ఇన్‌చార్జి పూడూరి రాజిరెడ్డి తాను రాసిన కథను ఆంగ్లంలో వినిపించారు. 40 ఏళ్లలోపు వయసు గల రచయితలను ప్రోత్స హించేందుకు కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించిన ఈ కార్యక్ర మంలో పాల్గొనేందుకు తెలుగు భాష నుంచి పూడూరి రాజిరెడ్డికి ఆహ్వానం లభించింది. ఇలా 24 భాషలకు సంబంధిం చిన యువ రచయితలకు ఆహ్వానం రాగా వారు వారి ప్రచురణలను ఆంగ్లంలో చదివి వినిపించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగపురానికి చెందిన పూడూరి రాజిరెడ్డి 2009లో ‘చింతకింది మల్లయ్య ముచ్చట’ శీర్షికతో రాసిన కథ ‘సాక్షి’ ఫన్‌డే మ్యాగజైన్‌లో ప్రచురితమైంది. ఈ కథను రాజిరెడ్డి ఎంచుకుని యువ సాహితీ కార్యక్రమంలో ఆంగ్లంలో ‘హీరో ఆఫ్‌ నాన్‌ స్టోరీ’ శీర్షికన చదివి వినిపించారు. ఈ కథలో కథానాయకుడు మల్లయ్య జీవితంలో నాటకీయతను చొప్పించకుండా మల్లయ్యకు ఉన్న తనదైన అస్తిత్వం, ఉనికిని కాపాడుతూ కథనం సాగుతుంది. మనిషిని మనిషిగా గుర్తించకుండా నాటకీయ తను చొప్పించే ప్రయత్నాలను వ్యంగ్యంగా చిత్రిస్తూ సాగుతుందీ కథనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement