నల్లధన చట్టంతో ప్రపంచ దేశాల సరసన భారత్ | Sakshi
Sakshi News home page

నల్లధన చట్టంతో ప్రపంచ దేశాల సరసన భారత్

Published Mon, Mar 2 2015 4:03 AM

నల్లధన చట్టంతో ప్రపంచ దేశాల సరసన భారత్ - Sakshi

న్యూఢిల్లీ: నల్ల కుబేరులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్రం ప్రతిపాదించిన చట్టంతో భారత్ నల్లధనంపై ఉక్కుపాదం మోపుతున్న సింగపూర్, బ్రిటన్, అమెరికా తదితర దేశాల సరసన చేరనుంది. ఆదాయ వివరాల దాచివేత, విదేశాల్లోని ఆస్తులకు సంబంధించి పన్ను ఎగవేత తదితర నేరాలకు పాల్పడేవారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, 300 రెట్ల జరిమానా తదితర ప్రతిపాదనలతో చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం తెలిసిందే.  కాగా, విదేశాల్లో నల్లధనం కలిగివున్న భారతీయులు తమ విదేశీ బ్యాంకు ఖాతాలు లేదా సంపద గురించి ప్రభుత్వానికి తెలియజేసేందుకు చివరి అవకాశమిస్తున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా ఆదివారం పేర్కొన్నారు.  
 

Advertisement
Advertisement