
అమరావతి ఫైలును తిప్పిపంపిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర నిర్మాణానికి పర్యావరణ అడ్డంకులు ఎదురయ్యాయి. నగర నిర్మాణానికి అనుమతి కోసం ఏపీ ప్రభుత్వం పంపిన ఫైలును కేంద్రం తిప్పి పంపింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర నిర్మాణానికి పర్యావరణ అడ్డంకులు ఎదురయ్యాయి. నగర నిర్మాణానికి అనుమతి కోసం ఏపీ ప్రభుత్వం పంపిన ఫైలును కేంద్రం తిప్పి పంపింది. అటవీ భూమిని బదలాయించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
మొత్తం 19 వేల హెక్టార్ల భూమిని కోరడంపై కేంద్ర పర్యావరణ సలహా సమితి సందేహాలు వ్యక్తం చేసింది. డీనోటిఫికేషన్‌కు సంబంధించిన సమాచారం అసంపూర్తిగా ఉందని పర్యావరణ సలహా సమితి చెప్పింది. ఇప్పటికే రాజధాని నిర్మాణం విషయమై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.