కారు లోన్ వాయిదా తీర్చలేదని.. | CCTV footage shows brutal murder of a man in Haryana's Yamunanagar over car loan payment. | Sakshi
Sakshi News home page

కారు లోన్ వాయిదా తీర్చలేదని..

Dec 5 2015 8:10 PM | Updated on Oct 9 2018 5:39 PM

వడ్డీ వ్యాపారుల ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. కారు లోన్ వాయిదా తీర్చడంలో ఆలస్యం చేసినందుకు గాను హర్యానా యమునా నగర్ కు చెందిన వ్యక్తిని దారుణంగా పొడిచి చంపారు.

చండీఘడ్:   వడ్డీ వ్యాపారుల ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. కారు లోన్ వాయిదా తీర్చడంలో ఆలస్యం చేసినందుకు హర్యానాలో ఓ  వ్యక్తిని  దారుణంగా   పొడిచి చంపారు.  అతని కోసం కాపు కాచి మరీ  దాడి చేసి, హతమార్చిన  దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. పోలీసులు అందించిన వివరాల ప్రకారం  హర్యానా యమునా నగర్ కు చెందిన షా... కారు కొనుక్కునేందుకు  స్థానిక వడ్డీ వ్యాపారి రవీందర్ దగ్గర అప్పు తీసుకున్నాడు. 

 

అయితే వాయిదా  చెల్లించడంలో ఆలస్యం చేశాడు.  దీంతో సదరు వడ్డీ వ్యాపారి ఈ దురాగతానికి తెగబడ్డాడు.  బైక్పై వచ్చిన ఓ యువకుడు ముందు రవీంద్రను అడ్డుకొని వాగ్వాదానికి దిగాడు.  ఈ క్రమంలో స్ర్కూడ్రైవర్  తీసుకొని  రవీంద్ర  ఛాతీపై పొడిచి అక్కడినుంచి పారిపోయాడు.  తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ స్థానిక ఆస్పత్రి ఆవరణలో పడిపోయాడు.  అతడు బాధతో విలవిల్లాడుతూ కుప్పకూలిపోయిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి పృథ్వీసింగ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement