breaking news
car loan payment
-
కారు లోన్ ముందుగా చెల్లించడం ఎలా? తెలుసుకోండి!
ఒకేసారి ఫ్లెక్సీక్యాప్, లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? – వెంకట్రామన్ శ్రీనివాసన్ మీకు ఈక్విటీల గురించి మెరుగైన అవగాహన ఉంటే అప్పుడు లార్జ్‌క్యాప్, మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు పెట్టుబడులను కేటాయించుకోవచ్చు. తద్వారా పోర్ట్‌ఫోలియోని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి బదులు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మరింత మెరుగైన ప్రత్యామ్నాయం అవుతుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు అన్ని రకాల మార్కెట్ విలువ కలిగి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కాకపోతే ఆయా మార్కెట్ విభాగాలకు ఫ్లెక్సీక్యాప్‌లో కేటాయింపులు వేర్వేరుగా ఉండొచ్చు. ఉదాహరణకు ఫ్లెక్సీక్యాప్ పథకాలు లార్జ్‌క్యాప్ కంపెనీలకు ఎక్కువ కేటాయిపులు చేస్తుంటాయి. మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీలకు తక్కువ కేటాయింపులు చేస్తుంటాయి. అందుకని పెట్టుబడి మొత్తాన్ని ఒకే ఫ్లెక్సీక్యాప్ పథకంలో కాకుండా, కనీసం మూడు ఫ్లెక్సీక్యాప్ పథకాలకు కేటాయించుకోవాల్సి ఉంటుంది. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కనుక విడిగా లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాబోదు. ఎక్కువ రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు అయితే ఒకవైపు ఫ్లెక్సీక్యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తూనే, మరోవైపు 15 శాతం వరకు పెట్టుబడులను మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు కేటాయించుకోవడం ద్వారా మెరుగైన రాబడులు సమకూర్చుకోవచ్చు. నేను రూ.7 లక్షలు రుణంపై కారు కొనుగోలు చేశాను. దీన్ని ముందుగా తీర్చివేయాలన్నది నా ప్రణాళిక. ఇందుకోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుకూలమైన పథకాలు ఏవి? పీజీఐఎం ఇండియా మిడ్‌క్యాప్ అపార్చునిటీస్ ఫండ్‌లో రాబడులను ప్రతి మూడేళ్లకోసారి వెనక్కి తీసుకోవడం సరైన నిర్ణయమేనా? – ఆదిత్య బి కారు రుణాన్ని ముందుగా తీర్చివేయాలనుకోవడం మంచి నిర్ణయం. విలువ తరిగిపోయే కారు వంటి ఆస్తి కోసం రుణం తీసుకోవడం సూచనీయం కాదు. మీరు మీ కారు రుణాన్ని ఏడేళ్లలోపు తీర్చివేయాలని అనుకుంటున్నారు. కనుక స్వల్పం నుంచి మధ్యస్థ కాలానికి వీలుగా మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడులను కాపాడుకోవడంతోపాటు, రాబడులు కూడా ఇక్కడ కీలకం అవుతాయి. మీ కారు రుణాన్ని ముందుగా చెల్లించి వేయడం కోసం మీరు హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి ఇవి అనుకూలంగా ఉంటాయి. ఈక్విటీతోపాటు డెట్‌లోనూ ఈ పథకాలు పెట్టుబడులు పెడతాయి. దీంతో మీ పెట్టుబడి వృద్ధి చెందుతుంది. మార్కెట్ల పతనం, అస్థిరతలను ఎదుర్కొనే రక్షణ ఉంటుంది. మూడేళ్ల తర్వాత మీ కారు రుణాన్ని ముందుగా చెల్లించి వేయడం కోసం ప్రతి నెలా ఆదాయంలో మిగులును అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మూడు నుంచి నాలుగేళ్లలోపే కారు రుణం తీర్చివేయాలని అనుకుంటే అందుకోసం ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కారు రుణాన్ని ముందుగా వదిలించుకునేందుకు మీవద్ద నెలవారీ మిగిలే మొత్తం కీలక పాత్ర పోషిస్తుంది. ఇక పీజీఐఎం ఇండియా మిడ్‌క్యాప్ అపార్చునిటీస్ అనేది మిడ్‌క్యాప్ పథకం. మిడ్‌క్యాప్ ఫండ్స్ సహజంగా స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి అస్థిరతలతో ఉంటాయి. దీర్ఘకాలంలో ఇవి మెరుగైన రాబడులు ఇవ్వగలవు. కనుక మూడేళ్లకోసారి లాభాలను వెనక్కి తీసుకోవడం సరైన నిర్ణయం అవ్వదు. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
కారు ఈఎమ్ఐ చెల్లించే సులభమైన టిప్స్, ఇవే!
చాలామంది కార్లను ఈఎమ్ఐ పద్దతిలో కొనుగోలు చేస్తూ ఉంటారు, మొదట్లో బాగున్నప్పటికీ క్రమంగా కార్ ఈఎమ్ఐ భారంగా మారుతుంది. అయితే కారు లోన్ చెల్లించడానికి కొన్ని సులమైన మార్గాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. కారుని సెలక్ట్ చేసుకోవడం: కొనుగోలుదారుడు ముందుగా తాను ఎలాంటి కారు కొనాలనేది డిసైడ్ చేసుకోవాలి. కారు కొనడానికి మీ ఆర్థిక పరిస్థితిని కూడా బేరీజు వేసుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. తక్కువ డబ్బుతో కారు కొనాలనుకున్నప్పుడు హ్యాచ్‌బ్యాక్ ఎంచుకోవడం మంచిది. ప్రీమియం SUV ఎంచుకుంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. డౌన్ పేమెంట్ పెంచుకోవడం: నిజానికి మీరు మొదట్లో చెల్లించే డౌన్ పేమెంట్ మీద కూడా ఈఎమ్ఐ ఆధారపడుతుంది. ఎక్కువ డౌన్ పేమెంట్ చేయడం వల్ల చెల్లించాల్సిన ఈఎమ్ఐ తగ్గుతుంది. మొత్తం వడ్డీ మీద కూడా ఇది ప్రభావం చూపుతుంది. అడిషినల్ ఈఎమ్ఐ చెల్లించడం: మీరు ఎంచుకునే ఈ అడిషినల్ ఈఎమ్ఐ వల్ల లోన్ భారం కొంత తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లోన్ కాలపరిమితి, వడ్డీ రేటు రెండూ కూడా తగ్గుతాయి. ఉదాహరణకు నెలకు రూ. 19,500 చెల్లిస్తున్నారనుకుంటే, అదనంగా ప్రతి నెల రూ. 500 చెల్లించాలి. అప్పుడు మీరు నెలకు రూ. 20,000 చెల్లించవచ్చు. ఇది ఈఎమ్ఐ చివరలో కొంత ఉపశమనం కలిగిస్తుంది. లోన్ ముందస్తుగా చెల్లించడం: మీరు తీసుకున్న లోన్ లేదా ఎంచుకున్న ఈఎమ్ఐ ముందస్తుగా చెల్లించడం వల్ల అది మీకు చాలా ఉపశమనం కలిగిస్తుంది. ముందుగానే ఈ ఎంపిక గురించి తెలుసుకోవాలి, అప్పుడు మీకు వడ్డీ ఎక్కువ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం: మీరు ప్రతి నెల లోన్ చెల్లిస్తున్నట్లయితే తప్పకుండా అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. అనవసర ఖర్చులు మీకు ఆర్ధిక భారాన్ని పెంచుతాయి. అయితే మీరు కారు కొనేటప్పుడే నిత్యావసరాల ఖర్చులను కూడా అంచనా వేసుకోవాలి. ఇవన్నీ ఈఎమ్ఐ తొందరగా క్లియర్ సహాయపడతాయి. -
కారు లోన్ వాయిదా తీర్చలేదని..
చండీఘడ్: వడ్డీ వ్యాపారుల ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. కారు లోన్ వాయిదా తీర్చడంలో ఆలస్యం చేసినందుకు హర్యానాలో ఓ వ్యక్తిని దారుణంగా పొడిచి చంపారు. అతని కోసం కాపు కాచి మరీ దాడి చేసి, హతమార్చిన దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. పోలీసులు అందించిన వివరాల ప్రకారం హర్యానా యమునా నగర్ కు చెందిన షా... కారు కొనుక్కునేందుకు స్థానిక వడ్డీ వ్యాపారి రవీందర్ దగ్గర అప్పు తీసుకున్నాడు. అయితే వాయిదా చెల్లించడంలో ఆలస్యం చేశాడు. దీంతో సదరు వడ్డీ వ్యాపారి ఈ దురాగతానికి తెగబడ్డాడు. బైక్‌పై వచ్చిన ఓ యువకుడు ముందు రవీంద్రను అడ్డుకొని వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో స్ర్కూడ్రైవర్ తీసుకొని రవీంద్ర ఛాతీపై పొడిచి అక్కడినుంచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ స్థానిక ఆస్పత్రి ఆవరణలో పడిపోయాడు. అతడు బాధతో విలవిల్లాడుతూ కుప్పకూలిపోయిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి పృథ్వీసింగ్ తెలిపారు. -
కారు లోన్ వాయిదా తీర్చలేదని..