కారు ఈఎమ్ఐ చెల్లించే సులభమైన టిప్స్, ఇవే!

How To pay car loans smartly - Sakshi

చాలామంది కార్లను ఈఎమ్ఐ పద్దతిలో కొనుగోలు చేస్తూ ఉంటారు, మొదట్లో బాగున్నప్పటికీ క్రమంగా కార్ ఈఎమ్ఐ భారంగా మారుతుంది. అయితే కారు లోన్ చెల్లించడానికి కొన్ని సులమైన మార్గాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

కారుని సెలక్ట్ చేసుకోవడం:

కొనుగోలుదారుడు ముందుగా తాను ఎలాంటి కారు కొనాలనేది డిసైడ్ చేసుకోవాలి. కారు కొనడానికి మీ ఆర్థిక పరిస్థితిని కూడా బేరీజు వేసుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. తక్కువ డబ్బుతో కారు కొనాలనుకున్నప్పుడు హ్యాచ్‌బ్యాక్ ఎంచుకోవడం మంచిది. ప్రీమియం SUV ఎంచుకుంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి.

డౌన్ పేమెంట్‌ పెంచుకోవడం:

నిజానికి మీరు మొదట్లో చెల్లించే డౌన్ పేమెంట్‌ మీద కూడా ఈఎమ్ఐ ఆధారపడుతుంది. ఎక్కువ డౌన్ పేమెంట్ చేయడం వల్ల చెల్లించాల్సిన ఈఎమ్ఐ తగ్గుతుంది. మొత్తం వడ్డీ మీద కూడా ఇది ప్రభావం చూపుతుంది.

అడిషినల్ ఈఎమ్ఐ చెల్లించడం:

మీరు ఎంచుకునే ఈ అడిషినల్ ఈఎమ్ఐ వల్ల లోన్ భారం కొంత తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లోన్ కాలపరిమితి, వడ్డీ రేటు రెండూ కూడా తగ్గుతాయి. ఉదాహరణకు నెలకు రూ. 19,500 చెల్లిస్తున్నారనుకుంటే, అదనంగా ప్రతి నెల రూ. 500 చెల్లించాలి. అప్పుడు మీరు నెలకు రూ. 20,000 చెల్లించవచ్చు. ఇది ఈఎమ్ఐ చివరలో కొంత ఉపశమనం కలిగిస్తుంది.

లోన్ ముందస్తుగా చెల్లించడం:

మీరు తీసుకున్న లోన్ లేదా ఎంచుకున్న ఈఎమ్ఐ ముందస్తుగా చెల్లించడం వల్ల అది మీకు చాలా ఉపశమనం కలిగిస్తుంది. ముందుగానే ఈ ఎంపిక గురించి తెలుసుకోవాలి, అప్పుడు మీకు వడ్డీ ఎక్కువ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

అనవసర ఖర్చులు తగ్గించుకోవడం:

మీరు ప్రతి నెల లోన్ చెల్లిస్తున్నట్లయితే తప్పకుండా అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. అనవసర ఖర్చులు మీకు ఆర్ధిక భారాన్ని పెంచుతాయి. అయితే మీరు కారు కొనేటప్పుడే నిత్యావసరాల ఖర్చులను కూడా అంచనా వేసుకోవాలి. ఇవన్నీ ఈఎమ్ఐ తొందరగా క్లియర్ సహాయపడతాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top