సీబీఐ ఆఫీసులో సీబీఐ సోదాలు

CBI Raids In CBI Seized Alok Verma, Rakesh Asthana Chambers - Sakshi

విధుల్లో చేరిన కొన్ని గంటల్లోనే నూతన డైరెక్టర్‌ తనిఖీలు

అలోక్‌ వర్మ, రాకేష్‌ అస్థానా ఛాంబర్లను సీజ్‌ చేసిన అధికారులు

సాక్షి, న్యూఢిల్లీ :  కేంద్ర దర్యాప్తు సంస్థలో రాత్రికి రాత్రే భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం ఉదయం తెలుగు వ్యక్తి మన్నెం నాగేశ్వరరావుని సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే నూతన డైరెక్టర్‌ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీబీఐ ఆఫీసులో సోదాలు మొదలయ్యాయి. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్థానా మధ్య వివాదం నెలకొనడంతో వారిని విధుల నుంచి తప్పించి సెలవుపై పంపారు. సీబీఐ కేంద్ర కార్యాలయంలోని అలోక్‌ వర్మ, అస్థానా, సస్పెండైన డీఎస్పీ దేవేందర్‌ ఆఫీసుల్లో నాగేశ్వరరావు తనిఖీలు చేపట్టారు. వారి ఛాంబర్లను సీజ్‌ చేశారు. ఇతరులెవరూ సీబీఐ కార్యాలయంలోకి రాకుండా చర్యలు తీసుకున్నారు.

(చదవండి : సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top