ఎయిర్‌సెల్‌ - మ్యాక్సిస్‌ కేసు : చిదంబరానికి ఊరట

CBI Court Extends Interim Protection Of Karti Chidambaram And P Chidambaram - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్‌ - మ్యాక్సిస్‌ కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలకు ఊరట లభించింది. వీరికి సీబీఐ, ఈడీ కేసుల్లో మధ్యంతర ఊరటను సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం వచ్చే ఏడాది జనవరి 11 వరకూ పొడిగించింది. కేసుకు సంబంధించి మరిన్ని పత్రాలను సమీకరించేందుకు సమయం కావాలని అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోరడంతో కేసు విచారణను వాయిదా వేసింది.

ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో మారిషస్‌ కంపెనీకి అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం చట్టవిరుద్ధంగా విదేశీ పెట్టుబడులను అనుమతించారన్న సీబీఐ ఆరోపణలను నిరాధారమైనవని చిదంబరం కోర్టు ముందు పేర్కొన్నారు. కాగా దర్యాప్తుకు చిదంబరం ఎంతమాత్రం సహకరించడం లేదని ఆయన ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ వాదనలు వినిపిస్తూ తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top