ఏవియేషన్‌ కుంభకోణంలో దీపక్‌ తల్వార్‌ అరెస్ట్‌

CBI Arrests  Deepak Talwar In Aviation Scam In New Delhi - Sakshi

న్యూఢిల్లీ : యూపీఏ హయాంలోని విమానయాన కుంభకోణానికి సంబంధించిన కేసులో దీపక్‌ తల్వార్‌ను గురువారం అరెస్టు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే అప్పటి విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మూడు రోజుల పాటు గ్రిల్ దాఖలు చేసినట్లు స్పష్టం చేసింది. కాగా, ఈ కేసుకు సంబంధించి దీపక్‌ తల్వార్‌దే మొదటి అరెస్టు అని సీబీఐ తెలిపింది.

సీబీఐ వివరాల ప్రకారం.. యూపీఏ హయాంలోని మంత్రులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులతో దీపక్‌ తల్వార్‌ చట్టవిరుద్ధంగా లాబీయింగ్‌లో పాల్గొన్నట్లు స్పష్టం చేసింది. ఎమిరేట్స్, ఎయిర్ అరేబియా,ఖతార్ ఎయిర్‌వేస్ వంటి విమానయాన సంస్థలు తమ భద్రతకు సంబంధించి 2008-09లో అనుకూలంగా ట్రాఫిక్ హక్కులను పొందేందుకు దీపక్‌ తల్వార్‌కు రూ. 272 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వెల్లడించింది. కాగా ఈ మొత్తం సొమ్మును అతని కుటుంబ సభ్యుల పేరుతో ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు తేలింది. ఈ మొత్తంలో కొంత భాగాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ సింగపూర్‌లో తన పేరు మీద ఉన్న ఖాతాలో జమచేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని స్పష్టం చేసింది. బ్రిటీష్‌ వర్జీనియాలోని ఎం/ఎస్‌ ఆసియా ఫీల్డ్‌ కంపెనీకి ఈ మొత్తాన్ని నగదు రూపంలో బదిలీ చేసినట్లు సమాచారం. అయితే ఈ కంపెనీ దీపక్‌ తల్వార్‌ పేరు మీద రిజిస్టరైనట్లు తేలింది.

అయితే ఈ కేసు విచారణలో ఉండగానే దీపక్‌ తల్వార్‌ దుబాయ్‌ పారిపోయినట్లు సీబీఐ స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది జనవరి 31న దుబాయ్‌ ఇమ్మిగ్రేషన్‌ అథారిటీ అతన్ని దేశం నుంచి బహిష్కరించడంతో తాజాగా ఈడీ అతన్ని అదుపులోకి తీసుకుంది. ఎయిర్ ఇండియాలో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ విలీనం, బోయింగ్-ఎయిర్‌బస్‌ నుంచి 111 విమానాలను రూ.70 వేల కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం, ప్రైవేటు విమానయాన సంస్థలకు విదేశీ పెట్టుబడులతో శిక్షణా సంస్థలను ప్రారంభించడం లాంటివి ఈడీ ఈ కేసులో అటాచ్‌ చేసినట్లు సీబీఐ పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top