సీఏ ఫైనల్‌ ఫలితాలు విడుదల | CA final results released by cam devarajareddy | Sakshi
Sakshi News home page

సీఏ ఫైనల్‌ ఫలితాలు విడుదల

Jan 17 2017 10:42 PM | Updated on Jul 28 2018 8:18 PM

చార్టెడ్‌ అకౌంట్స్‌ ఫైనల్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంట్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు సీఏఎం దేవరాజ రెడ్డి మంగళవారం ఢిల్లీలో విడుదల చేశారు.

న్యూఢిల్లీ: చార్టెడ్‌ అకౌంట్స్‌ ఫైనల్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంట్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు సీఏఎం దేవరాజ రెడ్డి మంగళవారం ఢిల్లీలో విడుదల చేశారు. సీఏ ఫైనల్‌ గ్రూప్‌–1లో 37 వేల మంది పరీక్షకు హాజరైతే 2,655 మంది (7 శాతం) , గ్రూప్‌–2లో 36 వేల మందికి గాను 4,545 (12 శాతం) మంది, రెండు గ్రూప్‌లకు కలిపి 36 వేల మందికి 4,256 (11 శాతం) మంది ఉత్తీర్ణులైనట్టు ఆయన తెలిపారు.

లక్నోకు చెందిన ఈతి అగర్వాల్, భివాండికు చెందిన పియూష్‌ రమేష్‌ లోహి, అహ్మదాబాద్‌కు చెందిన జ్యోతి ముఖేష్‌ భాయ్‌ మొదటి మూడు ర్యాంకులు సాధించారు. డిసెంబర్‌లో జరిగిన సీపీటీ పరీక్షలకు 70 వేల మంది విద్యార్థులు హాజరైతే అందులో 46 శాతం ఉత్తీర్ణతతో 32,658 మంది అర్హత సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement