‘జీఎస్‌టీ పరిధిలోకి ఇంధన ధరలు’

Bring fuel items under GST to reduce inflation - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ఇంధన ధరలను జీఎస్‌టీ పరిధిలోకి తేవాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కోరారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్‌ను జీఎస్‌టీలో 18 శాతం పన్ను శ్లాబ్‌లో చేర్చాలని సూచించారు. ఇది దేశ ప్రజలు కోరుతున్నదేనని, సామాన్యులు ఉపయోగించే వస్తువులను జీఎస్‌టీ నుంచి తొలగించాలని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

200 వస్తువుల పైగా జీఎస్‌టీ రేట్లను తగ్గించడం తమ విజయంగా ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే జీఎస్‌టీని సమూలంగా మార్చివేస్తామని రాహుల్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top