తండ్రిని రక్షించుకున్న తనయ 

A Brave Daughter save her father - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆడవాళ్లు మైనస్, మగవాళ్లు ప్లస్‌ అనే అభిప్రాయం ఇప్పటికీ సమాజంలో కొనసాగుతుండడం వల్ల భారత్‌లో గత రెండు దశాబ్దాల్లో దాదాపు కోటి మంది శిశు బ్రూణ హత్యలకు పాల్పడ్డారు. దీన్ని మార్చాలనే ఉద్దేశంతోనే కేంద్రం ‘బేటీ బచావో, బేటీ పడావో’ లాంటి నినాదాలను తీసుకొచ్చి విస్తత ప్రచారాన్ని సాగిస్తోంది. 

ఆడ పిల్లలను మైనస్‌గా భావించడానికి పెళ్లి సందర్భంగా కట్న కానుకలు ఇచ్చి పంపించాల్సి ఉంటుందని, అవసరానికి కూడా వారు అందిరారన్నది చాలా మంది తండ్రుల అభిప్రాయం. ఇది పూర్తిగా తప్పని డాక్టర్‌ రచిత్‌ భూషణ్‌ శ్రీవాస్తవ పేస్‌బుక్‌ పోస్టింగ్‌ స్పష్టం చేస్తోంది. 

పూజా బిజార్ణియా అనే ఓ ధైర్యం కలిగిన కూతురు చావు బతుకుల మధ్యనున్న తన తండ్రిని రక్షించడం కోసం తన లివర్‌ను దానం చేసింది. ఆ ఆపరేషన్‌ సక్సెస్‌ అయిందని, తండ్రికి లివర్‌ను దానం చేసిన ఆ తనయను అభినందించకుండా ఉండలేకపోతున్నానంటూ డాక్టర్‌ భూషణ్‌ పేర్కొన్నారు. తండ్రి కూతుళ్ల ఫొటోను కూడా ఆయన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయగా ఇప్పుడది వైరల్‌ అవుతోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top