హ్యాపీ బర్త్‌ డే అద్వానీజీ... | BJP President Amit Shah wish to LK Advani's on his birthday | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్‌ డే అద్వానీజీ...

Nov 8 2015 9:22 AM | Updated on Aug 24 2018 2:17 PM

బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీకి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ఉదయం అద్వానీ నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛాలు

న్యూఢిల్లీ : బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీకి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ఉదయం అద్వానీ నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛాలు ఇచ్చి బర్త్ డే విషెష్ తెలియచేశారు. సుమారు 20 నిమిషాల పాటు ఆయనతో అమిత్ షా ముచ్చటించారు. మరోవైపు అద్వానీకి ట్విట్టర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

 

'బెస్ట్ టీచర్ అద్వానీజీ' అంటూ మోదీ ట్విట్ చేశారు.  అద్వానీ నుంచి తాను వ్యక్తిగతంగా చాలా నేర్చుకున్నానని ఆయన తెలిపారు. అలాగే పలువురు ప్రముఖులు ..అద్వానీకి బర్త్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. కాగా బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ నేడు 88వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement